షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!

ఏపీ ఎన్నికల్లో వివేకా హత్య కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఇవాళ మరో మలుపు తిరిగాయి. వివేకా హత్య పేరుతో తనను టార్గెట్ చేస్తున్న వైఎస్ షర్మిలను అన్న, సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలో కౌంటర్ ఇచ్చారు. పసువు చీర కట్టుకుని ప్రత్యర్ధుల ఇళ్లకు వెళ్లే వాళ్లు వైఎస్ వారసులు ఎలా అవుతారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు షర్మిలకు తాకాయో లేదో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రియాక్ట్ అయ్యారు.

పులివెందులతో షర్మిలపై జగన్ చేసిన కామెంట్స్ పై చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా...మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం? అంటూ ట్వీట్ చేశారు. జగన్ చేసిన వైఎస్ వారసత్వ విమర్శలకు చంద్రబాబు ఇలా కౌంటర్ ఇచ్చినట్లయింది.

sajjala slams chandrababu for his reaction on ys jagan s criticism on ys sharmila in kadapa

చంద్రబాబు ట్వీట్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ జగన్ కామెంట్స్ ను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ పెట్టారు. రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే... చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోందన్నారు. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే... చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+