మొదలైన ప్రభాస్ ఊచకోత.. బుకింగ్స్ తో 'సలార్' సంచలన రికార్డు
పాన్ ఇండియా మెగాస్టార్ ప్రభాస్ రేంజ్ గురించి, అతనికున్న అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహించనిస్థాయిలో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రభాస్ నుంచి వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నమోదు చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. డార్లింగ్ సినిమా అంటే కనీసం రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతోంది. ఆయన సినిమాలు మొదటి మూడురోజులు రూ.300 కోట్ల కలెక్షన్లు వసూలు చేయడం కామన్ గా మారిపోయింది. ఫ్లాపైన చిత్రాలకు కూడా నష్టాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
ప్రభాస్ తాజా సంచలనం సలార్ కు విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే టికెట్ల అమ్మకాలు మొదలవడంతోపాటు గ్రాస్ కలెక్షన్లు 50వేల డాలర్లను దాటాయి. అలాగే రికార్డు స్థాయి స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు కాబట్టి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. కేజీఎఫ్ 2 సినిమాకు మించి బుకింగ్స్ జరుగుతున్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మాతల ప్లానింగ్ చాలా బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డుస్థాయిలో విడుదల కాబోతోంది. బాహుబలి2 ను మించి కలెక్షన్లు వస్తాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ అందించడం గమనార్హం.

రోజురోజుకు, సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ ఏవిధంగా పెరుగుతుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమాకు కూడా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ అందించడం ఒక్క ప్రభాస్ కే సాధ్యమైంది. దేశంలో ఏ హీరో ఈ ఫీట్ ను అందుకోలేని విధంగా ఉంది. ప్రాజెక్ట్ కే విడుదల తేదీ రావాల్సి ఉంది. ఇది విడుదలైన తర్వాత వేసవిలో సలార్ 2 రిలీజయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications