Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Samantha: తిరుచానూరు అమ్మవారి సేవలో సినీనటి సమంత; త్వరలో భారీ సినిమాతో రీ ఎంట్రీ?

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద సినీ నటి సమంత సందడి చేశారు. ఈరోజు ఆమె తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు సినీనటి సమంత. దర్శనానంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి సమంతకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ఎక్కువగా భక్తి మార్గంలో పయనించే నటి అయిన సమంత, నాగచైతన్యతో బ్రేకప్ సమయంలో కూడా భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో పూజలు నిర్వహించారు. మయో సైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమయంలో కూడా సమంత రూత్ ప్రభు భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు సమంత.

Samantha Actress Samantha worshipped Tiruchanur padmavathi ammavaru Re-entry with a big movie soon

తాజాగా ఆమె తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో సమంతను ఆలయం వద్ద చూసిన కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. పద్మావతీ అమ్మవారి ఆలయానికి వచ్చిన సమంత చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించారు.

ఇదిలా ఉంటే మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంతకు ఆ తర్వాత పెద్దగా సినిమాలు రాలేదు. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి బయటపడిన సమంత రీ ఎంట్రీ లోనే బిగ్ ఆఫర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. హీరో విజయ్ తో ఆమె ఒక భారీ చిత్రానికి కథానాయికగా నటించటానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ సినిమాకు సంబంధించిన చర్చలు సక్సెస్ అయితే నటి సమంత విజయ్ తో జతకట్టే నాలుగో చిత్రం ఇది అవుతుంది. ఇంతకుముందు సమంత దళపతి విజయ్ తో మంచి హిట్ సినిమాలలో నటించారు. ఇప్పుడు మళ్లీ సమంత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు పెద్దగా ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఈరోజు ఆమె తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించటం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+