ఏపీలో ఏఐ పోస్టులతో సంక్రాంతి రాజకీయ యుద్ధం.. టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీపీ!
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగకు ముందు రాజకీయ వాతావరణం వేడెక్కింది. సంక్రాంతి పండుగను తమ వారితో జరుపుకోవాలని ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు సొంత ఊర్లకు చేరుకుంటుంటే అధికార కూటమి టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు-ప్రతివిమర్శలతో రాజకీయ రంగం హీటెక్కుతోంది.. పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఉద్ధృతంగా సాగుతోంది.
ఏఐ ఆధారంగా ఫేక్ పోస్టులు, వీడియోలు
ఇక సోషల్ మీడియాలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా ఫేక్ వీడియోలను, పోస్ట్ లను చిత్రిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ కూటమి పాలనలో పబ్లిసిటీ ఫుల్.. ఆచరణ నిల్ అంటూ ఏపీకి కారులో ప్రయాణం చేస్తున్న ఒక జంట మాట్లాడుకుంటున్నారు అని ఏఐ వీడియో వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే, కౌంటర్ గా టీడీపీ కూడా ఏఐ పోస్టులు పెడుతోంది.

సంక్రాంతి సమయంలో సోషల్ మీడియా వార్
సంక్రాంతికి సొంతూరికి వెళ్ళే కుటుంబాలు ఏపీ ఎంత అభివృద్ధి చెందింది, కూటమి పాలనలో ఏపీ ప్రగతిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వీడియోలను, ఏఐ జనరేటెడ్ పోస్టులను పెట్టి వైసీపీని టార్గెట్ చేస్తుంది. అంతేకాదు టీడీపీ నేతలు గత వైఎస్సార్‌సీపీ పాలనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ హయాలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రజా సమస్యలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
సంక్రాంతి పండుగ పేరుతోనూ రాజకీయ లభ్దికి పార్టీల యత్నం
ముఖ్యంగా అప్పుడు వైసీపీ హయాంలో రహదారులు, సాగునీరు, సంక్షేమ పథకాల అమలులో లోపాలపై టీడీపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీ కూటమి పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, పాలనలో అయోమయం నెలకొందని ఆరోపిస్తున్నారు. సంక్రాంతి పండుగ పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో రచ్చ
ఈ రాజకీయ ఘర్షణ సోషల్ మీడియా వేదికగా మరింత ఉధృతమవుతోంది. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పర ఆరోపణలతో పోస్టులు, వీడియోలు విడుదల చేస్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. పండుగ వేళ ప్రజలు శాంతియుతంగా సంబరాలు చేసుకోవాలని భావిస్తుంటే, రాజకీయ పార్టీలు మాత్రం విమర్శల వేడి తగ్గించడంలేదు. మొత్తంగా చూస్తే, సంక్రాంతి పండుగకు ముందు ఏపీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ తాపత్రయం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం










Click it and Unblock the Notifications