Sankranti Wishes 2026 : ఇలా మీ ఫ్రెండ్స్ కు కొటేషన్లతో విష్ చేయండి..!
భోగి మంటల వెలుగులతో చీకటి రోజులకు వీడ్కోలు చెప్పుతూ, కొత్త ఆశలకు ఆహ్వానం పలికే సమయం ఇది. పాతదాన్ని వదిలి, కొత్తదాన్ని ఆహ్వానించే భావనతో మొదలయ్యే ఈ పండుగ... రైతు గుండెల్లో ఆనందాన్ని నింపుతుంది. పొలాల్లో పంటలు చేతికందిన వేళ, ఇంటింటా శుభకార్యాల సందడి, పిల్లల నవ్వులు, పెద్దల ఆశీస్సులు... ఇవన్నీ కలిసి భోగిని ఒక పండుగగా కాదు, ఒక అనుభూతిగా మార్చేస్తాయి.
భోగి తర్వాత వచ్చే సంక్రాంతి, కనుమ... తెలుగు సంస్కృతికి అసలైన పండుగల మణిహారంలా నిలుస్తాయి. ఆవుల పూజలతో కనుమ, బంధువుల కలయికతో సంక్రాంతి... మట్టి వాసన, పల్లె అందాలు, సంప్రదాయ వంటకాలు అన్నీ కలిసి మన మూలాలను గుర్తు చేస్తాయి. భోగి నుంచి కనుమ వరకూ జరిగే ఈ మూడు రోజుల పండుగ... కేవలం వేడుక కాదు, తెలుగు జీవనశైలికి ప్రతిరూపం.

ఈ సంక్రాంతికి మీ ప్రేమను, మీ ఆశీర్వాదాన్ని పంచాలనుకుంటున్నారా. అయితే మీ కోసమే ఈ శుభాకాంక్షల కొటేషన్లు.
ముగ్గుల మధ్య అమ్మవారి ఆశీర్వాదం,
గొబ్బెమ్మల మధ్య పల్లె గౌరవం...
ఇదే మన సంక్రాంతి అందం.
మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు
----------------------------------------------
భోగి మంటల్లో పాత బాధలు కాలిపోవాలి,
సంక్రాంతి వెలుగులు మీ జీవితంలో ఉదయించాలి,
కనుమతో కొత్త కలలు మొదలుకావాలి.
శుభ సంక్రాంతి
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
----------------------------------
పల్లె గాలి, పంట పాట,
సంప్రదాయం-సంతోషం ఒకే మాట.
మీకు మీ వారికీ సంక్రాంతి శుభాకాంక్షలు
--------------------
ఆహారమే ఔషధం అని గుర్తు చేసే పండుగ,
సంప్రదాయమే సంపద అని నేర్పే పండుగ.
హ్యాపీ సంక్రాంతి
------------------------------
పిల్లల నవ్వులు, పెద్దల ఆశీస్సులు,
ఇంటంతా పండుగ వెలుగులు...
ఇదే మీ ఇంటి సంక్రాంతి కావాలి
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
-----------------------------------
సంప్రదాయాన్ని మరిచిపోకుండా,
ఆధునికతతో ముందుకు నడిచే శక్తిని
ఈ పండుగ మీకు ఇవ్వాలి.
హ్యాపీ సంక్రాంతి
-----------------------------
మన పండుగలు మన మూలాలు...
ఆ మూలాలే మన బలాలు.
మట్టిని ముద్దాడిన చేతులే
మనకు అన్నం పెట్టాయి...
ఆ చేతులకు నమస్కరించే పండుగే
ఈ సంక్రాంతి.
మీ ఇంటా పంటలా సంతోషం పండాలి.
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు
----------------------
పొలాల్లో పంట పండితే
మనసుల్లో ఆశలు పూస్తాయి...
ఆశలన్నీ అక్కున చేరే పండుగ
సంక్రాంతి.
హృదయపూర్వక శుభాకాంక్షలు
-----------------------------------------------------
సూర్యుడికి కృతజ్ఞత,
భూమికి నమస్కారం...
మన సంస్కృతి సజీవంగా నిలిచే
అద్భుత ఘడియే సంక్రాంతి.
మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు
--------------------------
కాలం మారినా
సంక్రాంతి మారలేదు...
మన మూలాల్ని గుర్తు చేసే
అమ్మలాంటి పండుగ.
అమ్మ చేతి వంట తీపిని రుచి చూపించే పండుగ
శుభ సంక్రాంతి
---------------------------------------
భూమి నవ్వితే
మనిషి బ్రతుకు పండుతుంది...
ఆ నవ్వుల పండుగే
సంక్రాంతి.
మీ ఇంటా చిరునవ్వులు పూయాలి.
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు












Click it and Unblock the Notifications