సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణ ప్రారంభం-17ఏ చుట్టూనే లాయర్ సాల్వే వాదనలు..!

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ ప్రారంభించింది.

sc hearing begins on chandrababu quash petition in skill development case

స్కిల్ కేసులో తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని, దీని ప్రకారం ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు వాదిస్తుండగా.. సీఐడీ మాత్రం నేరం జరిగిన సమయంలో సెక్షన్ 17ఏపై హైకోర్టు తీర్పు ఇవ్వలేదని, కాబట్టి అరెస్టు సక్రమమేనని వాదిస్తోంది. దీంతో తాజాగా హైకోర్టులోనూ ఇదే అంశంపై విచారణ జరిగింది. హైకోర్టు మాత్రం సీఐడీ వాదనతో ఏకీభవిస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు.

స్కిల్ స్కాంలోనే చంద్రబాబును అరెస్టు చేసినప్పటికీ సెక్షన్ 17ఏ ప్రకారం చూస్తే ఈ కేసులో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చెల్లదనే వాదనతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే స్కిల్ స్కాం జరిగిందా లేదా అన్న దానిపై తాను వాదించడం లేదని, కేవలం ఈ కేసులో సెక్షన్ 17ఏ చెల్లుతుందా లేదా అంశంపై మాత్రమే వాదనలు వినిపిస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

క్వాష్ పిటిషన్ పై హైకోర్టు సెక్షన్ 17ఏపై ఇచ్చిన తీర్పు సరికాదని, రాజకీయ కక్షసాధింపులు నివారించేందుకే గతంలో ఈ సెక్షన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే వాదిస్తున్నారు. కాబట్టి చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ను కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. 2018 జూలై 18కు ముందు జరిగిన నేరాలకు సెక్షన్ 17ఏ వర్తించదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని హరీష్ సాల్వే ప్రస్తావిస్తున్నారు. దీంతో సెక్షన్ 17ఏ చెల్లుబాటుపై ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+