జగన్ సెక్యూరిటికీ, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం: తోపులాటతో పాదయాత్రలో ఉద్రిక్తత..
సిబ్బందికి-కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది.
Recommended Video

YS Jagan Padayatra : జగన్, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం
కడప: ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ శనివారం ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ భద్రతా సిబ్బందికి, ఆ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
పాదయాత్రలో జగన్ తో కరచాలనం చేసేందుకు కార్యకర్తలు ఎగబడటంతో సిబ్బంది వారిని నిలువరించారు. ఒకానొక దశలో సిబ్బంది వారిని తోసేయడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో సిబ్బందికి-కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తోపులాటకు దారితీసింది.

జగన్ దగ్గరకు తమను అనుమతించలేదన్న కారణంతో కొంతమంది వైసీపీ నేతలు నిరసనకు దిగారు. కాగా, పోట్లదుర్తి గ్రామంలో జగన్ కు ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రతో ముందుకు కదిలారు.












Click it and Unblock the Notifications