ఆ కార్పోరేషన్ పోలింగ్ తేదీ మార్పు- ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక..!!

మున్సిపల్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నేడు నామినేషన్ల విత్ డ్రాకు ఈ రోజుతో గడువు ముగుస్తుంది. రెబల్స్ బరిలో ఉండటంతో వారితో విత్ డ్రా చేయించేందుకు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. అటు జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు అయింది. కూటమి - వైసీపీ మధ్య ఈ స్థానిక పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కాగా.. ప్రధాన కార్పోరేషన్ లో పోలింగ్ తేదీ మార్పు చేసారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ అయింది.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 28న పోలింగ్ కు ముహూర్తంగా ఖరారు చేసారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నామినేషన్ల వేళ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా కడప జిల్లాలోని పలు మున్సిపాల్టీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ పరిణామాల పై వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. ఈ రోజు విచారణ జరగనుంది. కాగా.. మరో వైపు జెడ్పీటీసీ.. ఎంపీటీసీలకు ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం సవరించింది. మొదట ఈ నెల 28న జరగాల్సిన పోలింగ్, స్థానిక పైడితల్లి ఉత్సవాల నేపథ్యంలో 29వ తేదీకి వాయిదా పడింది. జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

కీలక కార్పొరేషన్ లో పొత్తు బ్రేక్ - జనసేన ఒంటరి పోటీ, బీ ఫారాలు..!!
కీలక కార్పొరేషన్ లో పొత్తు బ్రేక్ - జనసేన ఒంటరి పోటీ, బీ ఫారాలు..!!
sec-revises-vizianagaram-municipal-corporation-polling-date-to-october-29-here-the-details

ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో

కాగా, ఓట్ల లెక్కింపు తేదీలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 28న పోలింగ్, 30న కౌంటింగ్ యథాతథంగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. జిల్లాలోని బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలకు సంబంధించి పోలింగ్ (అక్టోబర్ 28), కౌంటింగ్ (అక్టోబర్ 30) తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఈ మార్పులను ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించాలని కోరారు. ఫిర్యాదులు.. కలెక్టర్ నివేదిక మేరకు ఇప్పటికే కడప జిల్లా మైదుకూరు మున్సిపాల్టీ ఎన్నికను వాయిదా వేసారు. త్వరలోనే మైదుకూరు స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి, పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా.. విజయనగరం కార్పోరేషన్ ను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+