విజయవాడలో 144 సెక్షన్, సెక్షన్ 30- ఉద్యోగులకు పోలీసు కమిషనర్ వార్నింగ్..
విజయవాడ నగరం ఇవాళ్టి నుంచి పోలీసుల గుప్పిట్లోకి వెళ్లబోతోంది. నగరంలో సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 ప్రకారం ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా ఇవాళ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆంక్షలు విధించడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. అలాగే ఆంక్షలు ఉల్లంఘిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల సాధన కోసం సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం చివరి నిమిషంలో విద్యుత్ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేసింది. అయితే నాయకులు సమ్మె వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించినా కిందిస్ధాయిలో ఉద్యోగులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల పర్వం కొనసాగుతోంది.

మరోవైపు ఈ నెల 17న విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో ఛలో విద్యుత్ సౌధ, ధర్నాలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. విద్యుత్ ఉద్యోగుల నిరసనల వల్ల తలెత్తే పరిణామాలపై ఓ అంచనాకు వచ్చిన పోలీసులు ఎక్కడికక్కడ భద్రత పెంచుతున్నారు. విద్యుత్ సౌధతో పాటు ఇతర విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద కూడా భద్రత పెంచారు. అలాగే ఎక్కువమంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తూ ఇవాళ కమిషనర్ ఓ ప్రకటన చేశారు.
విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో చేపడుతున్న ఛలో విద్యుత్ సౌధ, ధర్నాలకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. 144సెక్షన్, పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ధర్నాలో పాల్గొంటే ఎస్మా కూడా ప్రయోగించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అనుమతి లేకుండా విజయవాడలో నిరసనల్లో పాల్గొంటే ఐపీసీ సెక్షన్ 143, 427, 452, 283, 341, 506 ప్రయోగిస్తామని, ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయని కమిషనర్ తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications