వాట్సాప్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరిక!

ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రస్తుతం వాట్సాప్ వాడుతున్నారు. ఇక whatsapp లో వచ్చిన వివిధ వీడియోలను, వివిధ పోస్టులను ఓపెన్ చేసి చూస్తున్నారు. ఫోన్ వినియోగిస్తున్న వారికి వాట్సాప్ వినియోగం దినచర్యలో భాగంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్న అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వాట్సాప్ లో ఆ లింకులు ఓపెన్ చెయ్యొద్దు
వాట్సాప్ లో పెళ్లి పత్రికలు పంపి వాటిని పొరపాటున డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ లోకి చొరబడి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం పెరిగిపోయారు. ఈ క్రమంలోనే వాట్సాప్ వాడుతున్న వినియోగదారులకు మెటా హెచ్చరికను జారీ చేస్తుంది. వాట్సాప్ లో అపరిచిత వ్యక్తులు పంపుతున్న వీడియోలను, లింకులను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని హెచ్చరిస్తోంది.

Serious warning to WhatsApp users don t open those files and wedding invitation links

వాట్సాప్ ద్వారా సైబర్ నేరం
అసలు ఈ హెచ్చరిక వెనుక కారణమేమిటంటే ఇటీవల కాలంలో డిజిటల్‌ ఆహ్వాన పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే ప్రాంతాన్ని సూచించే గూగుల్‌ మ్యాప్స్‌ లింక్‌‌ను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డాక్యుమెంట్లు, వీడియోలు, లింకులు పంపుతున్నారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్ కు లింకులు పంపుతున్నారు.

ఫోన్స్ హ్యాక్ చేసే మాల్ వేర్
అయితే వాటిని ఎవరు పంపారు అనే ఆసక్తితో మనం వాటిని క్లిక్ చేస్తున్నాం.. దీంతో మన ప్రమేయం లేకుండా మన ఫోన్లోకి ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ డౌన్లోడ్ అవుతుంది. మన ఫోన్ లోని గ్యాలరీ, యాప్ ల లోని డేటాతో సహా అన్ని రకాల అనుమతులను ఈ మాల్వేర్ హ్యాక్ చేస్తుంది.

ఫోన్ లో వ్యక్తిగత డేటా చోరీ .. ఆపై బెదిరింపులు
ఆపై మన ఫోన్లో హ్యాకింగ్ కు సంబంధించిన యాప్స్ ఇన్స్టాల్ అయ్యి, ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది. దీంతో సైబర్ నేరగాళ్లు మన ఫోన్ లోని బ్యాంకు ఖాతాల ద్వారా అకౌంట్లో లోని డబ్బులను ఖాళీ చేస్తారు. అంతేకాదు ఫోన్ లోని వ్యక్తిగత ఫోటోలు సేకరించి, వ్యక్తిగత డేటా సేకరించి బెదిరింపులకు పాల్పడతారు.

వాట్సాప్ వినియోగదారులు.. తస్మాత్ జాగ్రత్త
కాబట్టి వాట్సాప్ వినియోగదారులు మనకు తెలియని అపరిచిత వ్యక్తులు వాట్సాప్ లో ఏమైనా పంపితే దయచేసి ఓపెన్ చేయొద్దు. అంతేకాదు వాట్సాప్ లో అనుమానాస్పదంగా ఉన్న లింకులను ముట్టుకోకుండా ఉంటే మంచిది. ఏదిఏమైనా వాట్సాప్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+