Arava Sridhar: అరవ శ్రీధర్ కు సర్కార్ భారీ షాక్- పార్టీ విచారణ వేళ..!
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (arava sridhar) కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీణ అనే మహిళా ఉద్యోగి గత కొన్ని రోజులుగా శ్రీధర్ పై చేస్తున్న ఆరోపణలు, రిలీజ్ చేస్తున్న వీడియోల నేపథ్యంలో జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించి ఆయనపై విచారణ చేయిస్తోంది. అదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు షాకిచ్చింది.
శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు (arava sridhar)
గత వారం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై రైల్వే కోడూరుకు చెందిన వీణ అనే మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోల్ని సైతం రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలు అంటూ తొలుత బుకాయించిన శ్రీధర్ కుటుంబం ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. దీంతో అసెంబ్లీలో ఉండి కూడా తనతో మాట్లాడిన వీడియోల్ని ఆమె విడుదల చేసింది. ఇందులో శ్రీధర్ వేధింపుల్ని బయటపెట్టింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలా మహిళతో అనుచితంగా ప్రవరించడం ఏంటన్న భావన వ్యక్తమైంది.

పార్టీ విచారణ వేళ కేసుల నమోదు
ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అదేశించడంతో పాటు తాజాగా ఆయన వివరణ కూడా తీసుకుంది. దీంతో పాటు శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కమిటీ ఇవాళ విచారణ కూడా ప్రారంభించింది. విచారణకు హాజరైన శ్రీధర్ తన వంతుగా వివరణ ఇచ్చి వెళ్లారు. అదే సమయంలో జాతీయ మానవహక్కుల కమిషన్ ఇప్పటికే శ్రీధర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో కడప జిల్లా పోలీసులు బీఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications