AP Elections: పెద్దిరెడ్డికి షాక్- మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ వేటు..!
ఏపీలో ఎన్నికల వేళ పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే డీజీపీ సహా 10 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఇవాళ మరో అధికారుల్ని విధుల నుంచి తప్పించింది. అదీ రాయలసీమలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో కావడం మరో విశేషం. ఇప్పటివరకూ రాయలసీమలో పోలీసు అధికారులపై ఫిర్యాదులతో వరుస బదిలీలు చేస్తున్న ఈసీ.. ఇదే క్రమంలో ఈ రెండు బదిలీలు కూడా చేసింది.
చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు సదుం ఎస్సై మారుతిపై ఇవాళ ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై తాజాగా దాడి జరిగింది. ఇందులో ఆయనకు గాయాలయ్యాయి. అలాగే ఆయన అనుచరులకూ దెబ్బలు తగిలాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. ఈ రెండు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తప్పించిన ఈసీ.. ఇవాళ చేసిన బదిలీల నేపథ్యంలో రాయలసీమలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నియమావళి ప్రకారం విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications