ఏపీ తీరానికి సమీపిస్తోన్న వాయుగుండం: ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతానికి వాయువ్యదిశలో పశ్చిమ- మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గత ఆరు గంటలంలో తన దిశను మార్చుకుంది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది.. ఈ రాత్రికి విశాఖపట్నం, ఒడిశాలోని గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరానికి సమీపించిన సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150, పూరీ- 220, ఏపీలోని కళింగపట్నం- 100, విశాఖపట్నం- 180 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా తీరం వైపు సమీపిస్తుండటంతో సముద్ర తీరం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలల ఉధృతి క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. అల్లకల్లోలంగా మారుతోంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.

Severe Cyclonic Storm Near Odisha and North Andhra Pradesh Brings Heavy to Very Heavy rain today

దీంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పోర్టుల్లో ప్రమాద సూచికలను ఎగురవేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నేడే.. తిరుమలలో ముగింపు ఘట్టం
నేడే.. తిరుమలలో ముగింపు ఘట్టం

వర్షాల తీవ్రత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి , ఏలూరు జిల్లాలపై అధికంగా ఉండొచ్చు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పితృ పక్షాలు ఎప్పుడు: మహాలయ అమావాస్య తేదీ, ఈ కాలంలో చేయాల్సినవి
పితృ పక్షాలు ఎప్పుడు: మహాలయ అమావాస్య తేదీ, ఈ కాలంలో చేయాల్సినవి

బలమైన గాలుల ఉధృతి, సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ముంచుకొస్తున్న వర్షాలు, వరదల ముప్పు నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, విపత్తు సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు.

బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో గానీ, పిడుగులు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు, శిథిల భవనాల కింద నిలబడకుడదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాలని కోరింది. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనందున, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+