అద్దెకు ఇల్లు, చేసేది వ్యభిచారం: మహిళలతోపాటు నిర్వాహకురాలి అరెస్ట్

Subscribe to Oneindia Telugu

అనంతపురం: నగరంలో ఓ వ్యభిచార గుట్టురట్టయింది. కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని బసవతారకనగర్‌లో నివాసాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు మహిళలు, విటుడిని అరెస్ట్ చేశారు.

టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ యల్లమరాజు, ఎస్ఐ శ్రీనివాసులు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఆత్మకూరు మండలం వడ్డిపల్లికి చెందిన అలివేలమ్మ బసవతారకనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని శింగనమలకు చెందిన ఓ మహిళ, తూర్పుగోదావరికి జిల్లా పెద్దాపురంలకు చెందిన మరో మహిళతో వ్యభిచారం చేయిస్తోంది.

Sex racket busted in Anantapur district and three arrested.

కాగా, తమకు ఈ విషయంపై సమాచారం అందడంతో ఆదివారం ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలు, మహిళలతోపాటు ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రఘు అనే విటుడిని అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sex racket busted in Anantapur district and three arrested.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి