Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షారుక్ ఖాన్, నయనతార యాక్షన్ థ్రిల్లర్.. 'జవాన్' ఎలా ఉందంటే

చిత్రం: జవాన్
నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు: గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ,
కథ, దర్శకత్వం: అట్లీ

కథ: గుండుతో కనిపించే ఓ గుర్తుతెలియని వ్యక్తి తన గ్యాంగ్ లోని ఆరుగురు అమ్మాయిలతో కలిసి ముంబయిలో మెట్రో రైలును హైజాక్ చేస్తాడు. రూ.40వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు. ప్రయాణికుల ప్రాణాల్ని తీయడానికి కూడా వెనకాడడు. హైజాకర్లను పట్టుకోవడానికి ఐపీఎస్ నర్మద (నయనతార) రంగంలోకి దిగుతుంది. అయినా చాకచక్యంగా అతను తప్పించుకుంటాడు. తాను సాధించుకొచ్చిన రూ.40వేల కోట్లను పేదల ఖాతాల్లో వేస్తాడు. ఈ వ్యవహారం సంచలనంగా మారుతుంది.

నర్మద, తన బృందం సాగించిన పరిశోధనలో హైజాక్ చేసిన వ్యక్తి, జైలర్ గా విధులు నిర్వర్తించే ఆజాద్ (షారుక్ ఖాన్) పోలికలతో ఉన్నట్లు గుర్తిస్తుంది. జైలర్ హైజాకర్ గా మారాడా? లేదంటే మరో వ్యక్తా? ఆయన వెంట ఉండే ఆరుగురు యువతులు ఎవరు? ఆర్మీలో పనిచేసిన విక్రమ్ రాథోడ్ కీ, ఆజాద్ కీ సంబంధం ఏమిటి? ప్రపంచంలో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీగైక్వాడ్ కథేమిటన్నది చిత్రంలో చూడాలి. సెకండాఫ్ లో ఈవీఎం సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలుస్తాయి. క్లైమాక్స్, ఫైట్స్ వంటివాటిల్లో దర్శకుడు లాజిక్స్ ను పట్టించుకోలేదు. కొన్ని సన్నివేశాలు మరీ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. కానీ మాస్ మసాలా సినిమాల్లో ఇటువంటి పట్టించుకోనవడంలేదనే రీతిలో అట్లీ సన్నివేశాలను తీర్చిదిద్దుతూ వెళ్లాడు. మాధవన్ నాయర్ పాత్రలో సంజయ్ దత్ సందడి చేశారు. ఈ సినిమాకు అది కొసమెరుపు.

shahrukh khan l

పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ ఫామ్ లోకి వచ్చారు. జవాన్ గా ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో అడ్వాన్స్ బుకింగ్స్ చాటిచెప్పాయి. బాలీవుడ్ బాద్ షా, అట్లీ కలిసి చేసిన సినిమా కావడంతో ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా ఈ సినిమా ఆసక్తిని, అంచనాలను పెంచింది.

మన దగ్గర కొత్తగా కథలు రావడంలేదు. పాతవాటినే అటుతిప్పి, ఇటుతిప్పి తెరకెక్కించాల్సి వస్తోంది. కథ పాతదైనా, కొత్తదైనా అనుకున్న రీతిలో తెరకెక్కిస్తే ఫలితం సాధించవచ్చని అట్లీ జవాన్ సినిమాతో నిరూపించాడు. తన గురువైన దర్శకుడు శంకర్ ఛాయలు జవాన్ లో బాగా కనిపిస్తాయి. దక్షిణాదిలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను, అందులోని సన్నివేశాలకు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే సమకూర్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో అట్లీ విజయవంతమయ్యాడు. షారుఖ్ మొదటి సీన్ నుంచి మెట్రో రైల్ సీన్ వరకు ప్రేక్షకులను కనెక్ట్ చేశాడు. దేశాన్ని కాపాడే జవాన్ గురించే కాకుండా అన్నంపెట్టే కిసాన్ (రైతు) గురించి కూడా చూపించాడు.

shahrukh khan l

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టే కార్పొరేట్లు ఉన్నప్పటికీ వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా సన్న, చిన్నకారు రైతులను ఎలా చిత్రవధ చేస్తాయో చూపించారు. సన్నకారు రైతు లోన్ కు ట్రాక్టర్ తీసుకొని కిస్తీ కట్టలేకపోయేసరికి అతని ఇంటిపై డేగల్లా వారి చిత్రవధకు గురిచేసే సన్నివేశాలకు ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగాడు అట్లీ. కమీషన్స్ కోసం కక్కుర్తి పడే ప్రభుత్వ పెద్దలు గవర్నమెంట్ హస్పిటల్స్‌లో సమకూర్చాల్సిన సరైన వసతులు కల్పించకపోవడం వంటివి టచ్ చేశాడు దర్శకుడు. అక్కడక్కడ వెంకటేష్ 'గణేష్'.. చిరంజీవి 'ఠాగూర్' సినిమాలు గుర్తుకొస్తాయి.

తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లోని ఎన్నో సన్నివేశాలను ఈ సినిమా గుర్తుకు తెస్తుంది. కథ కొత్తగా లేకపోయినప్పటికీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. మాస్ ప్రేక్షకులకు కోరుకునేవన్నీ ఇందులో పొందుపరిచాడు. విలన్ విజయ్ సేతుపతితోపాటు నయనతార, దీపికా పదుకొనే, ప్రియమణి పాత్రలను కూడా కథలో భాగంగా ఉండేటట్లు చూశాడు. సినిమాలో ఎక్కడా అనవసరమైన కామెడీ ట్రాక్ లేకుండా సీరియస్ గా తెరకెక్కించాడు. చివర్లో ప్రజలందరూ తమ హక్కు కోసం ఓటుహక్కును వినియోగించుకోవాలని చెప్పారు. యాక్షన్ తో, ఎమోషన్ తో కనెక్ట్ అయ్యేలా చేయడంలో అట్లీ విజయవంతమయ్యాడు. క్లైమాక్స్ ఒక్కటే కొంచెం సాగదీతగా ఉంది. దాన్ని కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

ఎలా చేశారంటే: షారుక్ ఖాన్ చక్కని అభినయం ప్రదర్శించారు. రకరకాల గెటప్పుల్లో ఒదిగిపోయారు. కుటుంబంతోపాటు సామాజికాంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంది. షారుక్ ఖాన్, నయనతార మధ్య కెమిస్ట్రీ ఎలివేట్ అవలేదు. అనిరుధ్ తన నేపథ్య సంగీతంతో షారుక్ హీరోయిజాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాడు. కథ మొదలు పెట్టిన విధానం, ముగింపు బాగుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+