కిరణ్‌కు తెలిసినా..: షర్మిల, జెపికి టూర్‌కి బ్రేక్!(పిక్చర్స్)
శ్రీకాకుళం/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్ర ఆదివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సాగింది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం చేయలేని కాంగ్రెసు పార్టీకి విభజించే హక్కు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముందుగా తెలిసినా తన పదవి ఊడుతుదనే ఉద్దేశ్యంతో గోప్యంగా ఉంచారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలు, ఢిల్లీ యాత్రలు ప్రజల కోసం కాదని, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడ్డుకోవడానికే అన్నారు. తలంగాణ ఇచ్చుకోండని బ్లాంక్ చెక్కు ఇచ్చిన చంద్రబాబు.. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు ప్రజలను మభ్యపెట్టేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు.
కాగా, షర్మిల యాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఈ నెల 2న తిరుపతి నుంచి ప్రారంభమైన యాత్ర 80 నియోజకవర్గాల్లో కొనసాగింది. పార్టీ తదుపరి కార్యక్రమాలను మరో రెండుమూడు రోజుల్లో ఖరారు చేస్తారు. మరోవైపు, అనంతపురం జిల్లాలో లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు తెలుగు తేజం యాత్రను సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆయన తాత్కాలికంగా యాత్రను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

మాట్లాడుతున్న షర్మిల
సమైక్య శంఖారావం బస్సు యాత్రలో శనివారం శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

టాటా!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్సులో నుండి టాటా చెబుతున్న దృశ్యం.

జన సందోహం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో తరలి వచ్చిన సమైక్యవాదులు, అభిమానులు.

అభివాదం
సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో తరలి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

అనూహ్య స్పందన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు శ్రీకాకుళం జిల్లాలో తరలి వచ్చిన సమైక్యవాదులు, అభిమానులు.

అనంతలో జెపికి చుక్కెదురు
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ఆదివార అనంతపురం జిల్లాలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తన తెలుగు తేజం యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.












Click it and Unblock the Notifications