నాగబాబుకు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి కౌంటర్
ఏపీ రాజకీయాల్లో హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్‌గా మారారు. మెగా ఫ్యామిలీ , సినీ ఇండస్ట్రీ అంతా కూడా జనసేన పార్టీకి మద్దతు తెలిపితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా మొదట పవన్ కల్యాణ్ గెలవాలని కోరుకుంటున్నట్టు ఓ ట్వీట్ చేశారు. అయితే ఆయన అనూహ్యంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మీదట మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్‌కు ఎటువంటి సంబంధం లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలపడంతో నాగబాబు పరొక్షంగా ఆయనపై విమర్శలు చేశారు. మనకు అండగా లేనప్పుడు మనవాడు ఎందుకవుతాడంటూ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నాగబాబు చేసిన ఈ ట్వీట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లుగా ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందున్న సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేటోడు' అన్నట్లు ఉన్న పోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఐతే ఈ పోస్ట్ బన్నీ పెట్టలేదని.. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే.. అలా కావాలనే డిజైన్ చేశారని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ రాజకీయంగా రచ్చ లేపుతుంది.ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి స్పందించారు.

ఈ ఇష్యూపై శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ నాగబాబు గారు ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం స్పష్టంగా తెలియలేదు.కానీ ఒకవేళ ఆయన బన్నీని ఉద్దేశించి అలాంటి ట్వీట్ చేశారు అంటే అది ఆయన సంస్కారానికి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు.కేవలం బన్నీ స్నేహబంధంతోనే ఇక్కడికి వచ్చారని రవి తెలిపారు.
అంతేకాకుండా ఓటింగ్ రోజు కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు నా స్నేహితులు ఏ రంగంలో ఉన్నా కూడా నేను వారికి సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ ఈయన బన్నీని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారు అంటే ఆయన స్వభావం ఏంటో అర్థం అవుతుంది.ఒకవేళ ఆ కామెంట్స్ బన్నీని ఉద్దేశించి అయితే ఆయన సంస్కారానికి అది వదిలేస్తున్నామంటూ శిల్పా రవి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications