Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Forbes: ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు యువకుడు..

ఓ తెలుగు యువకుడు ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు.

ఓ తెలుగు యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన యువకుడు చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ చోటు దక్కించుకున్నారు. శివతేజ ఐఐటీ గువాహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశారు. ప్రస్తుతం శివతేజ బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ముకేన్సర్ ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నారు.

ఇందులో శివతేజ మెషీన్‌ లెర్నింగ్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీలో క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన కూడా చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో స్థానం కల్పించింది.

A Telugu youth has got a rare honor. Dr. BR Ambedkar, a young man from Draksharama of Konaseema district has got a place in the Forbes list of young achievers.
ఫోర్బ్స్ యువ సాధకుల జాబితాలో శివతేజ చోటు దక్కడంతో ద్రాక్షారామంలో అందరు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు శివతేజను అభినందించారు.
A Telugu youth has got a rare honor. Dr. BR Ambedkar, a young man from Draksharama of Konaseema district has got a place in the Forbes list of young achievers.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+