సంతలో లిక్కర్ సేల్స్ .. చంద్రబాబు నూతన మద్యం పాలసీ ఇదే.. వైరల్ వీడియో!
ఆంధ్ర ప్రదేశ్ నూతన మద్యం పాలసీ అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. గత జగన్ సర్కార్ తీసుకువచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకే మద్యం షాపులను కేటాయిస్తూ టెండర్లు పిలిచి పాత మద్యం విధానాన్ని అమలులోకి తెచ్చింది. గత సర్కార్ తెచ్చిన లిక్కర్ బ్రాండ్ ల స్థానంలో బ్రాండెడ్ లిక్కర్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
సోషల్ మీడియాలో ఏపీ మద్యం విధానంపై రగడ
ఇదే సమయంలో క్వార్టర్ లిక్ర్క 99 రూపాయలకే ఇస్తామని చెప్పి దాని కోసం కూడా పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తక్కువ ధరకు లిక్కర్ కోసం ఏపీ వ్యాప్తంగా వైన్స్ వద్ద మందు బాబులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చిన నాటి నుండి వైసీపీ ఈ విధానంలో ఉన్న లోటు పాట్లను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.

సంతలో మద్యం విక్రయాలు
ఇక తాజాగా ఏపీలో చంద్రబాబు కూడా షాకయ్యే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం గురించి కొత్త రూల్ ప్రారంభమైనప్పటి నుండి, బెల్ట్ షాపులను టార్గెట్ చేస్తున్న వైసీపీ తాజాగా, నిన్న ఆదివారం నాడు , పశ్చిమగోదావరిలోని తణుకులో సంతలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయని హల్చల్ చేస్తుంది. కొంత మంది కూరగాయలు అమ్మినట్లు మద్యం బాటిళ్లను కూడా విక్రయిస్తున్నారని అందుకు సంబంధించిన వీడియో వైరల్ చేస్తుంది.
సంతలో మద్యం.
— థింక్ బిగ్ (@BNR1974) October 28, 2024
ఇదేమి చోద్యం?
పాలకుల ఇష్టారాజ్యం.
ధనార్జనే ధ్యేయం.
విద్య,వైద్యం మీద లేదు ఇష్టం.
పాడదాం చరమగీతం.
తణుకు సంతలో బహిరంగ మద్యం అమ్మకాలు.#YSRCP pic.twitter.com/Pbf9DqhmKu
తణుకు సంతలో లిక్కర్ సేల్స్
చాలా గ్రామాలలో వారంలో ఒక రోజు సంత ఏర్పాటు చేసి కూరగాయలు, ఆహార దినుసులను విక్రయిస్తారు. కానీ తాజాగా తణుకులో ఏర్పాటు చేసిన సంతలో మద్యం సీసాలు కూడా మార్కెట్‌లో కనిపించడం అందరినీ షాక్ కు గురి చేసింది . మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు ఎలా విక్రయిస్తారో అదే విధంగా ఆదివారం తణుకులో కొందరు యువకులు మద్యం బాటిళ్ళను సంతలో విక్రయించారు.
ఈ వీడియో తో టార్గెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
దీంతో మందుబాబులు కొందరు సంతలోనూ మద్యం కొనుగోలు చేశారు. తణుకు సంతలో మద్యం విక్రయాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం ఇవ్వటంతో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేశారు. అయితే ఈ సంతలో లిక్కర్ సేల్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వైసీపీ చంద్రబాబు నూతన మద్యం పాలసీ ఇలా ఉందని టార్గెట్ చేస్తుంది.












Click it and Unblock the Notifications