సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే
వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు షాక్ కి గురిచేశాయి. ప్రత్యర్థి పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని, అవతల పార్టీల ఆటలు సాగనివ్వద్దు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.
సజ్జల రామకృష్ణారెడ్డి పై ఫిర్యాదు.. క్రిమినల్ కేసు
వైసిపి పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారని టీడీపీనేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై ipc లోని u/s 153, 505(2)IPC, 125 RPA 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో గట్టిగా ప్రశ్నించలేనివారు ఏజెంట్లుగా ఉండొద్దని, నిబంధనల పేరుతో అడ్డుకునే వారిని గట్టిగా నిలదీయాలని, అవసరమైతే ఎంతవరకైనా వాళ్లతో ఫైట్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

కౌంటింగ్ ఏజెంట్ లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అంతేకాదు మన టార్గెట్ ఏమిటో దృష్టిలో పెట్టుకొని దానికి అవసరమైనవి తెలుసుకొని, ప్రత్యర్థి పార్టీలు అడ్డం పడకుండా చూసుకుంటూ, వారిని ఆపేందుకు ఏమేమి నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలన్నారు. ఒక్క వైసీపీ ఓటు కూడా వృధా కాకుండా కాపాడాలని అందుకు ఏమేమి చేయాలో తెలుసుకోవాలని రూల్ ప్రకారం పోదాం అంటూ కూర్చోకూడదని సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు.
తాడేపల్లి పీఎస్ లో సజ్జలపై కేసు
ఇక సజ్జల చేసిన వ్యాఖ్యలతో టిడిపి నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు ఆయన పైన కేసు పెట్టారు. ఇదిలా ఉంటే ఏపీలో కౌంటింగ్ కత్తిమీద సవాల్ లాగా మారింది. అటు ఎన్నికల సంఘానికి, ఇటు పోలీసులకు, రాష్ట్ర యంత్రాంగానికి ఈ కౌంటింగ్ టెన్షన్ పుట్టిస్తుంది.
కౌంటింగ్ నాడు అల్లర్లు సృష్టిస్తే, కౌంటింగ్ అడ్డుకుంటే జైలుకే
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం అధికారులు కౌంటింగ్ కేంద్రాలలో అల్లర్లు సృష్టిస్తే ఏ పార్టీ వారైనా సరే బయటకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ అడ్డుకునే వారిని అరెస్టు చేసి కేసులు కూడా నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications