హాట్ బ్యూటీ హనీ రోజ్ కు షాక్; ఆ సినిమా బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్!!
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు సరసన నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హనీ రోజ్ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తాజాగా రాహేలు పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేసిన హనీ రోజ్ కు ఇప్పుడు నెటిజన్లు ఊహించని షాక్ ఇస్తున్నారు.
తన సినిమాను ఆదరిస్తారనుకున్న హనీ రోజ్ ఫస్ట్ లుక్ తోనే ఖంగుతిన్నారు. హనీ రోజ్ సినిమా వస్తుందని సంబరపడిన అభిమానులు ఆమె తాజా సినిమాపై పెదవి విరుస్తున్నారు. హనీ రోజ్.. తెలుగులో ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన తార. సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో సెన్సేషన్ సృష్టిస్తున్న హనీ రోజ్ కు అభిమానులు ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత సినిమా అవకాశం వచ్చింది.

తాజాగా ఆమె సినిమా చేస్తున్నట్టు, త్వరలో ఆ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు క్లాస్, హాట్ ఫోటోలతో అందరి మనసులో దోచుకున్న హనీ రోజ్ బీఫ్ అమ్మే ఓ మాస్ పాత్రలో రాహేలు సినిమాలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత హనీ రోజ్ సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హనీ రోజ్ కత్తి పట్టుకొని సీరియస్ గా మాంసం కొడుతూ కనిపించింది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపిస్తున్నాయి. మాస్ రోల్ చేస్తున్న హనీ రోజ్ మాంసం కొడుతున్నా హాట్ గానే కనిపిస్తుండగా, అది పక్కన పెట్టిన చాలామంది ఫోకస్ బీఫ్ పై పడింది.
చాలామంది ఆమె బీఫ్ కొడుతూ, అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హనీ రోజ్ కనిపించిన తీరు కంటే బీఫ్ మీద నెటిజన్ల దృష్టి పడింది. ఇక హనీ రోజ్ చేస్తున్న ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని నెటిజన్లు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజా డిమాండ్ నేపథ్యంలో చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications