జగన్ హాల్లో ఉండగానే.. ఫైల్స్ ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన దొంగ!

సీబీఐ కోర్టులోని కొన్ని కీలక ఫైల్స్ ను దొంగిలించేందుకు ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. నగరంలోని గగన్ విహార్ లో ఉన్న సీబీఐ కోర్టులో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ : సీబీఐ కోర్టులోని కొన్ని కీలక ఫైల్స్ ను దొంగిలించేందుకు ఓ దుండగుడు విఫలయత్నం చేశాడు. నగరంలోని గగన్ విహార్ లో ఉన్న సీబీఐ కోర్టులో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సీబీఐ అధికారుల ఛాంబర్ లోకి చొరబడ్డ దుండగుడు ఫైల్స్ ఎత్తుకెళ్లడానికి యత్నించినట్టుగా తెలుస్తోంది.

Shocking incident in CBI court

అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు దుండగుడి యత్నానికి బ్రేక్ వేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు ఏపీ ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ కోర్టు హాల్ లోనే ఉండడం గమనార్హం. ఫైల్స్ ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఆ దుండగుడికి ఏమొచ్చింది? అన్న అంశంపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మొత్తానికి దుండగుడి చొరబాటుతో ఒక్కసారిగా సీబీఐ కోర్టులో కలకలం రేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+