కర్నూలు బస్సు ప్రమాదం వెనుక షాకింగ్ కారణాలు- కంట్రోల్ రూమ్స్ నెంబర్లు..!!

కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. వేకువ జామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలిని పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదం పైన విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసారు.

కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి పలు అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ బస్సుకు ఇన్సూరెన్స్ తో సహా అన్ని రకాల అనుమతుల గడువు ముగిసినట్లు చెబుతున్నారు. కాగా, ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్‌ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నార ని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మృతదేహాలను వెలికితీశామన్నారు.

Shocking reasons behind Kurnool bus tragedy control rooms numbers announces

ప్రస్తుతం బస్సు ప్రధాన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మరొక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఐజీ తెలిపారు. బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాద పరిణామాలను అంచనా వేసి, స్థానిక అధికారులు, వైద్యులు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్‌ తెలిపారు.

బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బైస్సు కిందకు వెళ్లడంతో బస్సులోని ఓ కేబుల్ తెగిపోయిందని తెలిపారు. అనంతరం మంటలు చెలరేగాయని చెప్పారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికితీసినట్లు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకోగా.. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు.

ఇక..బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వా సుపత్రి: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061, కర్నూలు పోలీసు స్టేషన్‌: 91211 01075, కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010. ఏవైనా సమస్యల ఉంటే కంట్రోల్‌ రూమ్‌లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ సిరి కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+