షాకింగ్: ఆస్తి కోసం భర్తపై సలసలకాగే నూనె పోసిన మహా ఇల్లాలు.. ఏపీలో దారుణం!!
మహిళలలో రోజురోజుకీ హింస పెరిగిపోతుంది. సహనమూర్తిగా మహిళను చెప్పుకునే రోజులు పోతున్నాయి. ఒకప్పుడుభర్తలు మాత్రమే భార్యలను హింసిస్తే, ఇప్పుడు భార్యలు భర్తలను హింసిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇల్లాలు భర్తపై కోపంతో భర్త నాలుక కొరికిపారేస్తే, మరో ఇల్లాలు భర్త గొంతుకు చున్ని బిగించి హతమార్చి గోనసంచిలో పెట్టి బయట పారేసింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహాతల్లి భర్త పై కోపంతో సలసల కాగే వేడి నూనె పోసింది.

భర్తపై సలసలా కాగే వేడినూనె పోసిన ఇల్లాలు
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో భర్తపై కోపం పెంచుకున్న భార్య అతడిని ఇంటికి పిలిచి సలసలా కాగే వేడి నూనె పోసింది. చోడవరం మండలం లక్ష్మీపురం లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేసింది. ఇంత పైశాచికమా అని అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే భార్య దాడిలో గాయపడిన బాధితుడు వెంకటేశ్వరరావు కొంతకాలం క్రితం భార్య చనిపోవడంతో విజయ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆస్తి పంపకాల విషయంలో వెంకటేశ్వరరావుకు విజయకు మధ్య ఇటీవల కాలంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో విజయ తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఆస్తి వివాదాల కారణంగా భర్తపై కాగే నూనె పోసి దాడి
ఇక భర్త పై కోపం పెంచుకున్న మహిళ ఓ పథకం ప్రకారం భర్త పై దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తాజాగా ఆస్తి వివాదాల గురించి మాట్లాడుకుందాం రమ్మని భర్తను పుట్టింటికి పిలిచింది. సరే సామరస్యంగా సమస్య పరిష్కరించుకుందామని వచ్చిన భర్తపై ఊహించని విధంగా సలసలా కాగే నూనెను పోసి దాడి చేసింది. సలసలా కాగే నూనె మీద పోయడంతో బాధితుడు హాహాకారాలు చేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి వెంటనే వెంకటేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి
భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైనా ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఈ తరహా దాడులు మంచివి కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సమాజంలో రోజురోజుకీ పేట్రేగిపోతున్న హింసకు ఇటువంటి ఘటనలు ఉదాహరణగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. సినిమాలు, మీడియా, సోషల్ మీడియా ప్రభావం యువత పైన మాత్రమే కాకుండా మహిళల పైన కూడా ఉంటుందని, ఇటువంటి నేరాలకు ఇవి కూడా ఒక కారణమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications