వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్యాకేజీ ఓ ఉంపుడుగత్తె, పడేస్తే ఉంటుంది, హోదా వల్ల ఇదీ లాభం: శివాజీ

ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమించిన నటుడు శివాజీ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను అప్ లౌడ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ఉద్యమించిన నటుడు శివాజీ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను అప్ లౌడ్ చేశారు. హోదా అంశంపై ఆయన స్పందించారు. ఈ వీడియో తాను ఎందుకు పెడుతున్ననో చెప్పారు.

'అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే.. వెంకయ్య గారు ఓ సుదీర్ఘమైన రెండు పేజీల ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని గురించి మాట్లాడుదామని పెట్టాను' అని తొలుత చెప్పారు.

డీజీపీ హెచ్చరికలు డోంట్ కేర్: పవన్ కంటే మరో అడుగు జగన్ ముందు!

ఆయన ఇంకా మాట్లాడుతూ.. దాని కంటే ముందు అందరికీ ప్రత్యేక హోదా, ప్యాకేజీకి తేడా ఏమిటి అనే డౌట్ ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక హోదా గురించి తాను వ్యక్తిగతంగా ఏం విధివిధానాలు రూపొందించలేదన్నారు. ప్రభుత్వమే విధివిధానాలు రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలను ఆయన చదివి వినిపించారు. అన్నింటా ట్యాక్స్ ఫ్రీ అవుతుందని చెప్పారు. దాంతో పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రత్యేకంగా నిధులు అందుతాయన్నారు.

ఇదీ ముఖ్యమైన అంశం

ప్రభుత్వానికి బడ్జెట్‌లో రెండు రకాలు ఉంటాయన్నారు. ఎక్స్‌పెండిచర్, అన్ ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్ అన్నారు.

ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్.. ఏదైతే క్యాష్‌కు సంబంధించి ఉంటుందో దాంట్లో నుంచి భారత ప్రభుత్వానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉందని శివాజీ చెప్పారు. ఇందులో నుంచి కేటాయింపులు ఎలా చేయాలంటే.. ఇందులో నుంచి 30 శాతం నిధులను ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు పంపించాలన్నారు. అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలను హోదా ఉన్న రాష్ట్రాలకు పంపించాలన్నారు. డిఫాల్టుగా బ్యాంకు అకౌంటులోకి చేరుతాయన్నారు.

ఇందులో మన రాష్ట్రానికి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. ఇదీ ముఖ్యమైన అంశం అని శివాజీ బల్లగుద్ది మరీ చెప్పారు.

అప్పులు కేంద్రమే చూసుకుంటుంది

దాని తర్వాత.. విభజన తర్వాత కేంద్రం నుంచి తీసుకున్న, ఇతర అప్పులు కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడున్న ప్రకారం అప్పులు తెచ్చుకుంటే డెబ్బై శాతం కట్టవలసిన పని లేదని, హోదా వస్తే 90 శాతం కట్టే పని ఉండదని చెప్పారు.

ప్రపంచ బ్యాంకు నుంచి పదివేల కోట్లు తెచ్చుకుంటే కేంద్రం 9వేల కోట్లు కడుతుందని, మనం వెయ్యి కోట్లు కట్టాలన్నారు. ఇదీ తేడా అన్నారు.

హోదా భార్య, ప్యాకేజీ ఉంపుడుగత్తె

ఇప్పుడు ప్యాకేజీకి, హోదాకు తేడా ఆలోచిద్దామని పేర్కొన్నారు. ఓ పెళ్లి చేసుకుంటే.. భార్యను బిడ్డను ఎంత బాధ్యతగా చూసుకోవాలో అలాంటిది హోదా అన్నారు. ప్యాకేజీ అంటే ఉంపుడు గత్తెను ఉంచుకుంటే ఇస్తే పడి ఉన్నట్లుగా అని వ్యాఖ్యానించారు. దానికి ఎప్పుడో ఏదో ఒకప్పుడు ఎంతో ఇస్తే పడేస్తే అలా పడి ఉంటుందన్నారు. అలాగే ప్యాకేజీ ఇచ్చి ఎంతో ఇస్తామని చెబుతారన్నారు. మనలను బీజేపీ - కాంగ్రెస్ విడగొట్టిందని వీటిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు.

పాపం చంద్రబాబుకు తెలుసు...

చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ తెలుసునని, పాపం ఇవన్నీ ఆయనకు తెలుసునని శివాజీ అన్నారు. ఇన్ని లాభాలు ఉంటే హోదాను ఎందుకు వదులుకోవాలో చెప్పాలన్నారు. గత రెండేళ్లుగా పోరాడుతుంటే వాళ్లేదో తిట్టుకుంటారని, తాను టిడిపి మొత్తాన్ని అనడం లేదన్నారు.

ఇంకొన్ని ముఖ్య విషయాలు చెప్పుకోవాలి

ప్రత్యేక హోదాను శివాజీ, పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు సొంతంగా తెచ్చాడని కాదన్నారు. మనకు ఇవ్వాల్సిన లోటు బడ్జెట్ ఈ రోజు వరకు దిక్కులేదని, ఇక ప్యాకేజీ ఇస్తామంటే మనం నమ్ముదామా అని నిలదీశారు.

English summary
Actor Sivaji video in social media over Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X