వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిని సిఎంని చేయాలనా...అదేనా వ్యూహం!

|
Google Oneindia TeluguNews

అమరావతి:లోపాయికారీగా టిడిపి మద్దతుదారుడని భావించిన పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో ఆ పార్టీ ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీశాడు. పవన్ కళ్యాణ్ దెబ్బకు డిఫెన్స్ లో పడిన టిడిపి ఒక్కసారిగా పూర్తి డిఫెన్స్ లోకి వెళ్లిపోయింది. తమ పార్టీని ఇంతగా దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఎందుకలా చేశాడో తెలుసుకోవాలని టిడిపి తీక్షణంగా అలోచన చేస్తోందట.

మరోవైపు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నాడని...అంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులంటూ చింతా మోహన్ చెప్పింది కానీ...ఇదే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో తరుచుగా ప్రస్తావిస్తున్న అనుభవం గురించి గానీ...గుర్తు చేసుకొని ఆలోచిస్తే...జరగుతున్నదేమిటో కొంత అర్ధం అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

రాష్టంలో బలమైన సామాజికవర్గమైన కాపు సామాజికవర్గం నుంచి ఒక వ్యక్తిని సిఎం చెయ్యాలని, అందుకు మరో బలమైన వర్గం ఎస్సీలు సహకరించాలని ఒక స్కెచ్ నడుస్తోందట. ఆ స్కెచ్ ప్రకారం ఆ ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించబడిన పేరు మెగాస్టార్ చిరంజీవి...ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజమంటున్నారు కొందరు రాజకీయ రంగ నిపుణులు.

ప్లీజ్...నోట్ దిస్ పాయింట్...

ప్లీజ్...నోట్ దిస్ పాయింట్...

వారు మరో విషయం కూడా గమనించమంటున్నారు...అదేమిటంటే...రాష్ట్రంలో పరిణామాల గురించి ముందే జోస్యం చెప్పిన చింతా మోహన్ గాని, పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గాని, ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించబడిన మెగాస్టార్ చిరంజీవి గానీ...ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు...అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీలు కావడమనేది...ఇంతకీ చెప్పేదేమిటంటే...ఆ ప్లాన్ ప్రకారమే పవన్ కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసేందుకు తనవంతు సహకారం అందిస్తున్నారట. అయితే ఆయన్ని సిఎంని చేయాలనే ఆలోచన మాత్రం ముందుగా ఆయనకు వచ్చిన ఆలోచన కాదట. కొందరు కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషించి తీసుకున్న నిర్ణయం అదట. ఎపిలో ప్రస్తుతం రాజ్యాధికారం అనుభవిస్తున్న రెండు ప్రధాన కులాలు కాకుండా రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న కాపు, ఎస్సీ కులాలు కలసి రాజ్యాధికారం దక్కించుకోవాలని, ఇందుకు ఆ రెండు అగ్ర కులాలు కాకుండా...కలిసొచ్చే మిగిలిన అన్ని కులాల తోడ్పాటు తీసుకోవాలని నిర్ణయించుకొని...ఆ ప్రకారం సైలెంట్ గా పని జరుపుకుంటూ పోతున్నారట.

చిరంజీవి ఎందుకంటే...కులం ప్లస్ ఇమేజ్...

చిరంజీవి ఎందుకంటే...కులం ప్లస్ ఇమేజ్...

అందులో భాగంగానే బాగా జనాకర్షణ కలిగిన...అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన...అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిని ముఖ్యమంత్రి పదవికి ముందుగానే ఎంపిక చేసుకొని ఆ తరువాత వివాదాలు తలెత్తే పరిస్థితి లేకుండా...ఇప్పటిదాకా రాష్ట్ర రాజకీయాలను ఏలిన ఆ రెండు అగ్రకులాలు కాకుండా మిగిలిన ప్రధాన కులాలన్నీ రాజ్యాధికారంలో జనాభా సంఖ్యాపరంగా భాగం పొందేలాగా పవర్ చేజిక్కించుకోవాలని పావులు కదిపాయట. అలా చిరంజీవి పేరు ముఖ్యమంత్రి పదవికి ఖాయం చేశారని...ఆయనైతే అందరి ఆమోదం పొందే అవకాశం ఉందని...చివరకు బిజెపి సహకారం కూడా లభించే ఛాన్స్ లు కూడా ఉంటాయని అంచనా వేశారట.

చింతా మోహన్ జోస్యం...పవన్ డైలాగులు...

చింతా మోహన్ జోస్యం...పవన్ డైలాగులు...

ఇదంతా ఒక కొలిక్కి వచ్చాకే చింతా మోహన్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయనడం...నీతినిజాయితీ కలిగిన నాయకుడు వస్తున్నాడనడం...పవన్ కళ్యాణ్ పదే పదే నాకు అనుభవం చాలదు అనడం...అలాగే చంద్రబాబుపై తీవ్రంగా దండెత్తుతూనే...జగన్ కోరిక నెరవేరదని జనసేన ఆవిర్భావ సభలో స్పష్టం చేయడం...ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావన వస్తుండటం...ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి మళ్లీ రాజకీయ తెరమీదకు రావడం ఖాయమంటున్నారు. మరోవైపు చిరంజీవికి టిడిపి తరుపున రాజ్య సభ సీటు అడిగితే చంద్రబాబు నో చెప్పారని...అలా అడిగి నో చెప్పించుకోవడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు.

గట్టి స్కెచ్చే...అంటున్నారు....

గట్టి స్కెచ్చే...అంటున్నారు....

టిడిపి గత ఎన్నికల్లో గెలుపొందటానికి పవన్ కళ్యాణ్, కాపు సామాజిక వర్గమే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పరిణామాల నేపథ్యంలో వారిని వీరిని ముఖ్యమంత్రిని చేసి భంగ పడేకన్నా...మిగిలిన కులాలు కలిసి చర్చించుకొని సామాజిక న్యాయం జరిగే విధంగా రాజ్యాధికారం చేపడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారట. పవన్ నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో ఈ తరహా వ్యాఖ్యలే చేయడం గమనార్హం. అయితే వీటన్నింటి మీద స్పష్టత రావడానికి మరో రెండు నెలల సమయం పట్టొచ్చని...ఏదేమైనా చిరంజీవి పొలిటికల్ పునరాగమనం తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ కూటమి నేరుగా రాజ్యాధికారం చేపట్టలేకపోయినా...తమ మద్దతు ఉంటేనే ఇటు టిడిపి-అటు వైసిపి గద్దె నెక్కేలాగా ఎపి రాజకీయాలను ప్రభావితం చేయగలమని నమ్మకంతో ఉన్నారట...త్వరలోనే మరికొన్ని సర్ ప్రయిజెస్ తప్పవంటున్నారు...సో...వెయిట్ అండ్ సీ...

English summary
Amaravathi:Will Pawan Kalyan's actions make Chiranjeevi chief minister?...Political experts are expected to have such type of a sketch behind state developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X