స్నేక్ గ్యాంగ్: రెండున్నర ఎకరాల్లో దయానీ డెన్
హైదరాబాద్: దారుణమైన ఆగడాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ విషయాలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్నేక్ గ్యాంగ్ లీడర్ ఫైసల్ దయానీ స్థావరం రెండున్నర ఎకరాల్లో ఉంది. అతని ఇంటి చుట్టూ కట్టుదిట్టమైన ప్రహారీ ఉంది. విశాలమైన ఆవరణలో పదుల సంఖ్యలో షెడ్లు ఉన్నాయి.
కోళ్లకు ఒక షెడ్, మేకలకు ఓ షెడ్, బాతులకు మరో షెడ్ ఉన్నాయి. ఇవి కాకుండా దయానీ ఇంటి పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని మీద దయానీ స్విమ్మింగ్ పూల్ అని రాసి ఉంది. ఇంటి ఆవరణలో అడవిని తలపించే విధంగా చెట్లు ఉన్నాయి.

దయానీ ఇంట్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా సోదాలు నిర్వహించారు. ఇంటి ఆవరణలో ఉన్న వాహనాలకు ధ్రువీకరణ పత్రాలు చూపించాలని దయానీ సోదరులను సివి ఆనంద్ అడిగారు. వాళ్లు వాటిని చూపించకపోవడంతో స్కార్పియో, వెస్పా, హోండా యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
స్నేక్ గ్యాంగ్ అరెస్టయిన తర్వాత కూడా ఆ గ్యాంగ్ సభ్యులపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు భయపడ్డారని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెంచి, మనోధైర్యం నింపచడానికే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఆనంద్ చెప్పారు.












Click it and Unblock the Notifications