విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య (ఫోటోలు)

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ గదిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాంగోపాల్ పేట్ ఠాణా సీఐ గంగారెడ్డి, ఎస్సై ఎన్. సురేష్ కుమార్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ మండలం మాదారం గ్రామానికి చెందిన డి.వెంకట్ రెడ్డి తనయుడు డి. కృష్ణారెడ్డి (45) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈనెల 11న సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు.

బుధవారం గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపు కొట్టారు. ఎంతకీ తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న మరో తాళంతో తెరిచారు. గదిలో పడిపోయి ఉన్న కృష్ణారెడ్డిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

వారు చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన మృతికి ఎవరూ కారణం కాదని, పిల్లలు క్షమించాలంటూ కృష్ణారెడ్డి రాసిన ఓ లేక గదిలో లభ్యమైంది. బేగంపేటలో నివాసంఉండే కృష్ణారెడ్డికి భార్య కల్పనతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గత రెండు నెలలుగా సక్రమంగా ఇంటికి వెళ్లడం లేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌పై మలక్ పేట చిరునామా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య


సికింద్రాబాద్‌లోని ఓ హోటల్ గదిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాంగోపాల్ పేట్ ఠాణా సీఐ గంగారెడ్డి, ఎస్సై ఎన్. సురేష్ కుమార్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య


బుధవారం గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపు కొట్టారు. ఎంతకీ తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న మరో తాళంతో తెరిచారు.

 విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య


గదిలో పడిపోయి ఉన్న కృష్ణారెడ్డిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

గత రెండు నెలలుగా సక్రమంగా ఇంటికి వెళ్లడం లేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదు. డ్రైవింగ్ లైసెన్స్‌పై మలక్ పేట చిరునామా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య

విషం తాగి హోటల్ గదిలో టెక్కీ ఆత్మహత్య


తన మృతికి ఎవరూ కారణం కాదని, పిల్లలు క్షమించాలంటూ కృష్ణారెడ్డి రాసిన ఓ లేక గదిలో లభ్యమైంది. బేగంపేటలో నివాసంఉండే కృష్ణారెడ్డికి భార్య కల్పనతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+