సంక్రాంతి రోజు షాకిచ్చిన విమానం
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సంక్రాంతి రోజు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖపట్నం రావాల్సిన కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని సర్వీసులను మాత్రం ఇతర ప్రాంతాలకు మళ్లించారు. విశాఖ- ఢిల్లీ ఇండిగో, ఎయిర్ ఇండియా, విజయవాడ- ముంబయి, హైదరాబాద్, చెన్నై ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దుచేశారు.
వీటి రద్దు వల్ల విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. గంటల కొద్దీ ఎయిర్ పోర్ట్ లో వేచి చూడాల్సి రావడం, తర్వాత విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేకపోతున్నామని, ఈ విషయంలో విమానాశ్రయ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రద్దయిన విమాన సర్వీసులు
AI486 విశాఖపట్నం-పోర్ట్‌బ్లెయిర్- న్యూఢిల్లీ
6E 5247/5248 విశాఖపట్నం- ముంబయి- విశాఖ ఇండిగో, ఎయిర్ ఇండియా
AI 451/452 న్యూఢిల్లీ-విశాఖపట్నం- న్యూఢిల్లీ
6E917/6E6089 చెన్నై- విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ- విజయవాడ ఇండిగో
5176/2776 ఢిల్లీ-విశాఖపట్నం-ఢిల్లీ సర్వీసులు












Click it and Unblock the Notifications