మీరే నా స్ఫూర్తి అంటూ లోకేష్ ...ప్రపంచంలోనే ప్రియమైన తాత అంటూ దేవాన్ష్ ..చంద్రబాబుకు బర్త్ డే విషెస్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు . దీంతో ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన తనయుడు లోకేష్ , మనవడు దేవాన్ష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికర ట్వీట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు ట్వీట్ చేశారు. తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన తండ్రి పట్ల తనకున్న ప్రేమనంతా నాన్నకు ప్రేమతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు .
ప్రజల బాగుకోసం అవిశ్రాంతంగా పగలనక, రాత్రనక పని చేసిన వ్యక్తిని చూస్తూ పెరిగానని నారా లోకేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు . ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, అభిరుచి ఈ నాటికీ చెక్కుచెదరలేదని ఆయన అన్నారు . దూరదృష్టి గల నాయకత్వంతో తనకు, కోట్లాదిమంది తెలుగువారికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తన ట్వీట్‌లో లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రమే కాదు లోకేష్ కొడుకు , చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ శుభాకాంక్షలు చెప్పిన తీరు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. అసలు కన్నా వడ్డీ ముద్దు అన్న చందంగా మనవడు ముద్దు ముద్దు మాటలతో తాతకు శుభాకాంక్షలు చెప్పారు .

బ్రాహ్మణి ట్విట్టర్ అకౌంట్ నుంచి తన మాటలుగా దేవాన్స్ తన తాత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచంలోనే ప్రియమైన తాతయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలని ట్విట్టర్‌లో పేర్కొన్న దేవాన్ష్ చేసిన ట్వీట్ లో "తాతా! మీ ప్రేమను పొందడం గొప్ప విషయం. మీరు నాకు ఓ ఐకాన్, స్ఫూర్తి. అన్నిటికంటే మీరు నా బెస్ట్ ఫ్రెండ్'' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన తాతయ్య పట్ల దేవాన్ష్ చూపుతున్న ప్రేమకు టీడీపీ అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక పార్టీ నాయకులు సైతం పెద్ద ఎత్తున రాజకీయాల్లో ఒక ఐకాన్ గా చంద్రబాబును భావిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు .
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications