సినిమా, హోటళ్లకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్- ఈ కార్డు లేకుంటే ఇక నో ఎంట్రీ..!!
సినిమాలు.. రెస్టారెంట్లు వెళ్లే వారికి బిగ్ అప్డేట్. ఇక నుంచి సినిమాకు వెళ్లాలంటే టికెట్ ఉంటే మాత్రమే సరి పోదు. అదే విధంగా హోటల్.. గేటెడ్ కమ్యూనిటీ.. సభకు వెళ్లినా మీ వద్ద ప్రభుత్వం నిర్దేశించిన కార్డు తప్పని సరి చేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన యాప్ పైన కసరత్తు జరుగు తోంది. క్యూ ఆర్ కోడ్ ద్వారా ధియేటర్లు.. రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల్లో స్కాన్ చేసి వెంటనే ఎంట్రీ ఇచ్చేలా నిబంధనలు సిద్దం అవుతున్నాయి.
కేంద్రం కీలక మార్పు తీసుకొస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా సినిమా హాళ్లు.. రెస్టారెంట్లు... గేటెడ్ కమ్యూనిటీల్లోకి ప్రవేశించేందుకు నిర్వాహకులకు తప్పక ఆధార్‌ను చూపించాల్సి ఉంటుంది. మీరు ఒక వేళ విద్యార్థి అయితే మీరు పరీక్షకు హాజరయ్యే ముందు కూడా ఈ గుర్తింపు కార్డును చూపమని అడగవచ్చు. అయితే మనం ఇచ్చే ఫొటో కాపీలు, ఆధార్ హార్డ్ కాపీలు దుర్వినియోగం అవుతాయనే భయం లేకుండా కేంద్రం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది.

దీనిని అధిగమించడా నికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతోంది. ఇకపై కొత్త కార్డుపై క్యూఆర్ కోడ్, మీ ఫొటో మాత్రమే ఉంటాయి. ఇతర వివరాలుండవు. దీని ద్వారా మీ ఆధార్ ఇకపై దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఆఫ్‌లైన్ ఆధార్ విధానంపై పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు.

ఇక, దీని ద్వారా ఇక నుంచి మీరు ఏదైనా సంస్థ లేదా ప్రదేశంలోకి ప్రవేశించే ముందు మీ గుర్తింపును యాప్ ద్వారా తనిఖీ చేస్తారు. ఈ కొత్త ఆఫ్‌లైన్ విధానం మీరు ఇకపై ఆధార్ ఫొటో కాపీలు, జిరాక్స్‌లు చూపించాల్సిన అవసరాన్ని తప్పిస్తుందని యూఐడీఏఐ తెలిపింది. ఇది మీకు ప్రస్తుత ఫొటోకాపీ ఉంచుకోవాల్సిన అవసరాన్ని తప్పించడమే కాక, ప్రైవసీ రక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొంది. వీటిని క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం చేయటం ద్వారా కార్డు పైన ఎలాంటి వివరాలు లేకుండానే గుర్తింపు కార్డుగా వినియోగించుకునే వెసులుబాటు ఏర్పడు తుందని వివరించారు. ఎక్కడైనా గుర్తింపు కార్దు వినియోగించుకునేలా ఈ నిర్ణయం అమల్లోకి తెస్తున్నారు. భద్రతా పరంగానూ ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications