Pawan Kalyan: సీఎంగా పవన్ కళ్యాణ్-ఇండస్ట్రీ ఫ్రెండ్ మనసులో మాట..!

ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లలోనూ తన పార్టీ జనసేనను 100 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించిన జనసేనానికి ఫాలోయింగ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ లేకపోతే కూటమికి ఇన్ని సీట్లు, అధికారం వచ్చేవి కావంటూ ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో పాత స్నేహితుడు ఒకరు తాజాగా ఆయన ఏదో ఒక రోజు సీఎం అవుతారంటూ మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు.

గతంలో పవన్ కళ్యాణ్ తో ఖుషీ సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ నటుడు ఎస్ జే సూర్య ఇప్పుడు పలు భాషల్లో నటిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ఖుషీ సినిమా నుంచీ పవన్ కళ్యాణ్ ను పిచ్చిగా అభిమానించే ఎస్ జే సూర్య ఇప్పుడు కమల్ హాసన్ నటిస్తున్న సీక్వెల్ మూవీ భారతీయుడు 2లోనూ నటించే అవకాశం వచ్చింది. దీంతో హైదరాబాద్ లో జరిగిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఎస్ జే సూర్య తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు.

south Indian actor director sj Surya wishes pawan kalyan to become chief minister of ap

భారతీయుడు 2 సినిమా కాన్సెప్ట్ అయిన ఓ వాక్యాన్ని ఎస్ జే సూర్య గుర్తుచేశారు. ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గొప్ప పనులు చేశారో వారు 'ఇండియన్' అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఇండియన్ ఉన్నారన్నారు. తనకు తెలిసిన ఇంకో పాయింట్ అందరితో పంచుకోవాలని, అటువంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి తన స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని తాను మూడేళ్ల క్రితమే చెప్పానని ఎస్ జే సూర్య గుర్తు చేసుకున్నారు. ఇందులో సగం ప్రూవ్ అయ్యిందని, మిగతా సగం మీరే ప్రూవ్ చేయాలంటూ అక్కడే ఉన్న అభిమానులను ఉద్దేశించి సూర్య వ్యాఖ్యానించారు. దీంతో అభిమానులు హర్షధ్వానాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+