ఆంధ్రాకు చల్ల చల్లని కబురు
వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. దీనివల్ల వేడిగా ఉన్న వాతావరణం కాస్తంత చల్లబడుతుందని భావిస్తున్నారు. అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, మాల్దీవుల్లోన్ని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయి. అలాగే లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో ప్రాంతాలు విస్తరించడానికి అనుకూలంగా ఉన్నాయి. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు, ఎల్లుండు వాతావరణం పొడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 - 4 డిగ్రీల చొప్పున పెరిగే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు; రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి నాలుగు డిగ్రీల చొప్పున పెరగొచ్చు.

రాయలసీమలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. బలమైన గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది . గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల చొప్పున పెరుగుతాయి.
శుక్రవారం రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఉరుములతో కూడి జల్లులు పడతాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం కనపడుతోంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది . గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల చొప్పున పెరుగుతాయి. వాతావరణాన్ని బట్టి తాము చెప్పిన సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని అమరావతి వాతావరణ కేంద్రం రాష్ట్రానికి సూచించింది.












Click it and Unblock the Notifications