ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఆహ్వానం..వ్యతిరేకిస్తోన్న టీడీపీ శ్రేణులు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి సైతం ప్రత్యేక ఆహ్వానం అందండంతో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఇక సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానాలు అందినట్టు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు, మోహన్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు వెళ్లాయని సమాచారం. ఇక ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందిందని తెలుస్తోంది.

అయితే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ నుంచి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో టీడీపీ అభిమానులు ఎన్టీఆర్‌పై అప్పట్లోనే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్ట సమయంలో స్పందించని ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎలా వస్తారంటూ టీడీపీలోని కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.
అయితే కూటమి విజయం సాధించిన తర్వాత కూటమి నేతలకు అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని స్పెషల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందండంతో ఆయన వెళ్తారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.












Click it and Unblock the Notifications