తిరుపతిలో వైభవంగా గోకులాష్టమి: ఇవే హైలైట్స్

నేడు.. శ్రీకృష్ణ జన్మాష్టమి. పురాణాల ప్రకారం.. భాద్రపద మాసంలో కృష్ణ పక్ష బహుళ అష్టమి తిథి నాడు కృష్ణ పరమాత్ముడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ వేడుకలను కృష్ణాష్టమి, గోకులాష్టమిగా దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి మరుసటి రోజు ఉట్టి కొట్టే సంబరాలు మిన్నంటనున్నాయి. భగవద్గీత ద్వారా మానవాళికి దిశానిర్దేశం చేసిన కృష్ణ పరమాత్ముడిని పూజించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాలకు భక్తులు దర్శించుకుంటోన్నారు.

గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోశాలలో అత్యంత వైభవంగా గోపూజ మహోత్సవం జరిగింది. ఈ ఉదయం జరిగిన ఈ విశేష కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామి వారికి విశేష అర్చనలు, షోడశోపచారాలను సమర్పించారు.

Special Rituals Krishnastami Or Gokulashtami at Sri Venkateswara Gosala Tirupati EO Offers Prayers

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోమాతతో పాటు దూడలకు నూతన వస్త్రాలు, పుష్పమాలలు సమర్పించారు. ఈఓ రవిచంద్ర స్వయంగా ఆవు పాలు పితికడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం మొత్తానికీ హైలైట్ గా నిలిచింది. టీటీడీ ఈఓ పితికిన ఆ పాలను స్వామి వారి పూజా కైంకర్యాల కోసం ఆలయ అర్చకులకు అందజేశారు. ఆ క్షీరంతోనే అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామి వారికి శాస్త్రోక్తంగా పాలాభిషేకం నిర్వహించారు.

గోకులాష్టమి మహోత్సవంలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో రాసిన ఏడు కోట్ల ఓం నమో వేంకటేశాయ నామ జప పుస్తకాలను స్వామి వారికి సమర్పించే కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో టీటీడీ ఈఓ పాల్గొన్నారు. పూర్ణాహుతి హారతి సమర్పించారు. సనాతన హిందూ ధర్మంలో గోమాతకు విశేషమైన స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ గోసేవను ధర్మంగా భావించాలని ఈ ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు జీ భానుప్రకాష్ రెడ్డి, విద్యా ఆరోగ్య విభాగం జేఈఓ ప్రభల గోపీనాథ్, గోశాల డైరెక్టర్ శివకుమార్, టీటీడీ విజిలెన్స్ అధికారి గిరిధర్ తదితర ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, భజనలు భక్తులను ఎంతగానో అలరించాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు శోభాయమానంగా ముగిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+