ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ : తొలిరోజు పెట్టుబడుల బోణీ-రూ.5 వేల కోట్లు-5 వేల ఉద్యోగాలకు ఆఫర్

ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో తొలిరోజే పెట్టుబడుల బోణీ కొట్టింది.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ,విదేశీ వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తల్ని ఆహ్వానించిన వైసీపీ సర్కార్.. భారీ ఏర్పాట్లే చేసింది. విశాఖలో మొదలైన పెట్టుబడుల సదస్సు తొలిరోజే పెట్టుబడుల బోణీ కూడా కొట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఓ సిమెంట్ కంపెనీ ప్రభుత్వానికి మంచి ఆఫర్ ఇచ్చింది.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ సంస్ధ ముందుకొచ్చింది. వైజాగ్ లో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన శ్రీ సిమెంట్స్ ప్రతినిధులు.. తమ పెట్టుబడుల ఆఫర్, అలాగే దాని వల్ల రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, రాష్ట్ర ఖజనాకు లభించే ఆదాయాన్ని కూడా ఆఫర్ రూపంలో ఇచ్చారు. దీంతో రాష్ట్రంలోకి ఈ సదస్సు ద్వారా వచ్చే తొలి పెట్టుబడి ఇదే కానుంది.

sri cement offer first invest of rs.5000 cr with 5k employment in ap global investors summit

శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ సంస్ధ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే సిమెంట్ పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో శ్రీ సిమెంట్స్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఛైర్మన్ హరిమోహన్ బంగూర్ తెలిపారు.

sri cement offer first invest of rs.5000 cr with 5k employment in ap global investors summit

తమ ప్లాంట్ స్ధాపన ద్వారా రాష్ట్రంలో ఐదు వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించబోతున్నట్లు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రకటించారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.వెయ్యి కోట్ల ఆదాయం కూడా అందిస్తామని కూడా ప్రభుత్వానికి ఆఫర్ చేశారు. దీనిపై ఈ సదస్సులో ఒప్పందం కుదుర్చుకోబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+