పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్; వైసీపీ ట్రోల్స్!!

సోషల్ మీడియాలో ఎప్పుడు చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల పైన తీవ్ర విమర్శలు చేసే శ్రీ రెడ్డి ఎటువంటి కామెంట్స్ చేస్తారు.. ఎలాంటి వీడియోలు పెడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల పైన ఓ రేంజ్ లో విరుచుకుపడిన అమ్మడు తాజాగా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిన్నా మొన్నటి వరకు కాస్త తగ్గిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ వీడియోతో శ్రీరెడ్డి టార్గెట్
ఇక మళ్లీ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు మొదలెట్టిన శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక వీడియోను పోస్ట్ చేసి ఆయనను టార్గెట్ చేశారు . దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి చెప్పిన మాటల తాలూకా ఒక పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.

Sri Reddy shocking post on Pawan Kalyan comments video on bhagat singh ycp trolls

భగత్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వీడియో
స్వాతంత్ర దినోత్సవం రోజు ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేయించి ఆ వీడియోను షేర్ చేశారు ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారని, భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని వ్యాఖ్యలు చేశారు.

అనదర్ డైమండ్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం .. అంటూ టార్గెట్

వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మాటలకు ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారు రా బాబు అనే డైలాగ్ ని కలిపి అనదర్ డైమండ్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం అంటూ క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ప్రస్తుతం శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శ్రీరెడ్డి పెట్టిన పోస్టుతో పవన్ ను ట్రోల్ చేస్తున్న వైసిపి సోషల్ మీడియా
ఇక శ్రీరెడ్డి పెట్టిన పోస్టును వైసిపి సోషల్ మీడియా తమకు తోచినట్టు వాడేస్తోంది. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు సామి ఉరేసారు అని కొంతమంది పోస్ట్ లు పెడుతున్నారు. ఉరేయడానికి ఆత్మహత్యకు తేడా తెలియని వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం అవుతున్నారని మరి కొంతమంది వైసిపి వారియర్స్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ ట్రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+