ఆయన నోట్‌లోనే ఉంది: టి బిల్లుపై కిరణ్‌కు శ్రీధర్ కౌంటర్

ముసాయిదా బిల్లును టేబుల్ చేయడమంటే ప్రవేశ పెట్టడమేనని వ్యాఖ్యానించారు. ముసాయిదా బిల్లుపై చర్చ కొనసాగుతుందని ముఖ్యమంత్రి నోట్‌లోనే స్పష్టంగా ఉందన్నారు. సభాపతిని ఎవరి కించపర్చినా తాము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అందరు కలిసి రావాలి: శైలజానాథ్
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తాము చట్టసభల్లో, న్యాయస్థానాల్లో ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటామని మంత్రి శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రపతి నుండి వచ్చిన తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందని విమర్శించారు.
శాసన సభ ఆమోదం లేకుండా కొత్త రాష్ట్రం ఏర్పడిన ఉదంతం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. విభజనను అడ్డుకునేందుకు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసన సభ్యులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఓట్లు, సీట్లు అంటూ కొందరు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.












Click it and Unblock the Notifications