హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజన బాధాకరం, రెచ్చగొట్టొద్దు: కెసిఆర్‌కి మర్రి సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Marri Sasidhar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం బాధాకరమని సనత్ నగర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, ఎన్ఎండిఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం అన్నారు. విభజన సున్నితమైన అంశమన్నారు. రాజకీయ లబ్ది కోసం దీనిపై రెచ్చగొట్టే ప్రకటనలు తగదంటూ పరోక్షంగా తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావును ఉద్దేశించి అన్నారు. హైదరాబాదు స్టేటస్ పైన వివాదాస్పద ప్రకటనలు మానుకోవాలన్నారు.

విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పడాన్ని తప్పుబట్టారు. తన భార్య సీమాంధ్రకు చెందిన వ్యక్తి అని, కుమారుడు విశాఖపట్నంలో ఉన్నాడని అంటూ, అలాగే అక్కడివాళ్లు ఇక్కడ నివాసం ఉంటున్నారని అన్నారు. అందరి కలయికతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధించిందన్న విషయం మర్చిపోరాదని గుర్తు చేశారు.

హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను ప్రాంతీయ విద్వేషాలతో చెడగొట్టవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా మాట్లాడాలి తప్ప, ఒక ప్రాంతాన్ని ఉద్ధేశించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగి ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు వీలుగా రెండు బృందాలను హైదరాబాద్‌లో అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదన తమ కమిటీ చాలాకాలం క్రితమే చేసినట్టు మర్రి గుర్తు చేశారు.

ఇందుకు హైదరాబాద్‌లో వసతి, సౌకర్యాలు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా సానుకూలంగా స్పందించలేదని సుతిమెత్తగా విమర్శించారు. జాతీయస్థాయి (ఎన్‌డిఆర్‌ఎఫ్)లో ఉన్నట్టే రాష్ట్రాల్లో ఎస్‌డిఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఫైలిన్ తుపాను, వరదలు సృష్టించిన బీభత్సం పట్ల మర్రి ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
NMDA vice chief and Congress MLA Marri Sasidhar 
 
 Reddy on Tuesday suggested that stop making 
 
 provocating statements on status of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X