Pushpa 2 మేనియా.. పుష్ప 2 కోసం షాకింగ్ లీవ్ లెటర్ రాసిన విద్యార్ధి!
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ పుష్ప 2 సినిమా మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
టీచర్ కు లీవ్ లెటర్ రాసిన విద్యార్ధి
పుష్ప అంటే ఫైర్... వైల్డ్ ఫైర్.. వరల్డ్ ఫైర్ అంటూ అభిమానులు అల్లు అర్జున్ నటనకు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు. బాక్సాఫీస్ ను బద్దలు చేస్తున్న ఈ సినిమా చూడటం కోసం విద్యార్థులు స్కూల్స్ కు, కాలేజీలకు డుమ్మా కొట్టి మరీ పుష్ప 2 సినిమాకి వెళ్లారు. ఇక తాజాగా ఒక విద్యార్థి పుష్ప 2 సినిమా చూడడానికి తనకు లీవ్ కావాలని టీచర్ కు లేఖ రాశాడు.

పుష్ప సినిమా కోసం విద్యార్ధి లీవ్ లెటర్
విద్యార్థి టీచర్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీచర్ కు లీవ్ లెటర్ రాసిన విద్యార్థి "సార్ నేను అల్లు అర్జున్ అభిమానిని.. పుష్ప 2 సినిమాకు వెళుతున్నాను.. దయచేసి నాకు ఈ రోజు లీవ్ ఇవ్వండి" అంటూ నిజాయితీగా తన లీవ్ లెటర్ లో పేర్కొన్నాడు. ఈ లెటర్ చదివిన టీచర్ ఆశ్చర్యానికి గురై, దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు,
సోషల్ మీడియాలో వైరల్ .. గతంలోనూ యూనివర్సిటీ విద్యార్థులు లీవ్ లెటర్
దీంతో ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లీవ్ లెటర్ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ సినిమాకు ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలు డుమ్మా కొట్టి వెళ్లి చూసిన సందర్భాలు ఉన్నాయి. 2021 సంవత్సరంలో వచ్చిన పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా చెన్నైలోని భారత్ యూనివర్సిటీకి చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు లీవ్ లెటర్ రాశారు.
అప్పుడూ.. ఇప్పుడూ పుష్ప మేనియా
తమకందరికీ సినిమా చూడటం కోసం సెలవు కావాలని లీవ్ లెటర్ రాయడం అప్పట్లో వైరల్ అయింది. హెచ్ఓడికి లీవ్ లెటర్ రాసిన విద్యార్థులు ఆయనకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మా దగ్గర ఒక ఎక్స్ట్రా టికెట్ ఉంది.. మీరు రావాలనుకుంటే మాతోపాటు సినిమాకు రావచ్చని అందులో రాశారు. అప్పట్లో ఆ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రస్తుతం పాఠశాల విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications