విజయవాడ పశ్చిమలో సుజనా వర్సెస్ టీడీపీ ! బయటపెట్టేసిన సీనియర్..!
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రభుత్వాల ఏర్పాటు పూర్తి కావడంతో ఒక్కొక్కరుగా బయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమిలో పార్టీల మధ్య అగాధం పెంచుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచేలా తాజాగా జరిగిన ఓ పరిణామాన్ని విజయవాడ టీడీపీ సీనియర్ నేత ఇవాళ బయటపెట్టేశారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్మాయి. ఇందులో తమకు అనుకూలంగా ఉంటారని భావించిన వారిని తమ నియోజకవర్గాల్లో నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎంపీలు కూడా దూరి లాబీయింగ్ చేస్తున్నారు. అయితే మధ్యలో ఎంపీ ఓ పార్టీ, ఎమ్మెల్యే మరో పార్టీ ఉన్న చోట ఇబ్బందులు తప్పడం లేదు. పేరుకు ఇద్దరూ కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే అయినా తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అన్న చందాన పరిస్ధితి తయారవుతోంది.

ఇదే క్రమంలో విజయవాడ పశ్చిమ సీటులో తాజాగా అధికారుల బదిలీల పర్వం బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ నేతల మధ్య చిచ్చు రేపింది. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ నేతలు ఇక్కడ అధికారుల బదిలీల కోసం చేసిన లాబీయింగ్ ఫలించలేదు. వీరి కంటే ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన కోరినట్లుగా ఈ బదిలీలు సాగాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇవాళ బయటపడ్డారు. ఎమ్మెల్యే అయితేనే తాను చెప్పినట్లుగా జరుగుతుందని తెలియదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications