''మామయ్య సూపర్బ్ గా నటించాడు'', గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాపై లోకేష్ ప్రశంసలు
బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పందించారు. ఈ సినిమాలో బాలకృస్ణ అద్భుతంగా నటించాడని ఆయన చెప్పారు.
అమరావతి :బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ స్పందించారు. ఈ సినిమాలో బాలకృస్ణ అద్భుతంగా నటించాడని ఆయన చెప్పారు.
బాలకృష్ణ కూతురు తన సతీమణి బ్రహ్మిణితో కలిసి గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీమియర్ చూశామని ఆయన చెప్పారు. మామయ్య ఈ సినిమాలో తన నటనా విశ్వరూపాన్ని చూసినట్టుగా లోకేష్ ట్టీట్ చేశాడు.

ఈ సినిమాను చూసి మంత్రముగ్ధులయ్యామని ఆయన చెప్పారు. అమరావతి గొప్పదనాన్ని తెలుసుకొన్నట్టు లోకేష్ చెప్పాడు. బాలయ్య నటన సూపర్ అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
హలీవుడ్ చిత్రం తరహలోనే గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తక్కువ బడ్జెట్ తోనే తక్కువ కాలంలోనే పూర్తి చేయడం కూడ విశేషమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రాన్ని హలీవుడ్ సినిమా స్థాయిలో తీసిన దర్శకుడు క్రిష్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications