ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు-అన్నీ పరిశీలించాకే హైకోర్టు తీర్పు

అమరావతిలో రాజధాని నిర్మాణం నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం సొంత పార్టీ నేతలకు ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భారీ ఎత్తున భూములు కట్టబెట్టిందన్న ఆరోపణలపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. గతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని హైకోర్టు తోసిపుచ్చడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో అమరావతి రాజధాని రాక నేపథ్యంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను గతంలోనే హైకోర్టు తోసిపుచ్చింది దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఇందులో ఏపీ హైకోర్టు అన్ని పరిశీలించకుండానే ఇన్ సైడర్ ట్రేడింగ్ ను కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.
హైకోర్టు అన్ని విషయాలు పరిశీలించాకే తుది ఉత్తర్వులు ఇచ్చిందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

supreme court rejects jagan governments allegations on amaravati insider trading

మరోవైపు అమరావతికి చెందిన మిగిలిన కేసులతో కలిపి విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే సుప్రీంకోర్టును కోరారు. రాజధాని రాకముందే అప్పటి మంత్రులు భూములు కొనుగోలు చేశారని, హరియాణా భూములపై ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసుపైనా విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే దీనిపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+