అమీర్ న్యూడ్ పోస్టర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పికె సినిమాలో నగ్నంగా ఉన్న చిత్రం పోస్టర్‌కు సుప్రీంకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. అతని న్యూడ్ పోస్టర్‌పై తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చివరకు అమీర్ ఖాన్ న్యూడ్ పోస్టర్‌కు సుప్రీంకోర్టు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

పికె సినిమాకు చెందిన న్యూడ్ పోస్టర్‌పై అమీర్‌ ఖాన్‌కు, దర్శకుడికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాలు కళకు, వినోదానికి సంబంధించినవని, వాటిని అలాగే ఉండనీద్దామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court snubs nude poster, gives green signal to Aamir Khan's PK

చిత్రం విడుదలపై ఆంక్షలు విధించడం ఫిల్మ్ మేకర్స్ రాజ్యాంగ హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇష్టం లేకపోతే పిటిషనర్ సినిమా చూడవద్దని, కానీ దానికి మతపరమైన అంశాలు జోడించవద్దని సలహా ఇచ్చింది.

పిటిషనర్ అమీర్ ఖాన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌లతో పాటు కేంద్రాన్ని, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖను ప్రతివాదులుగా చేర్చారు. అఖిల భారత మానవ హక్కులు, సామాజిక న్యాయ ఫ్రంట్ సినిమాపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. సినిమాపై కాన్పూర్‌లో మరో కేసు పెండింగులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+