Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దుపై తేల్చబోతున్న సుప్రీంకోర్టు-రేపు కీలక నిర్ణయం..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. స్కిల్ కేసులో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. హైకోర్టు స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏ37గా చేర్చిన ప్రభుత్వం సెప్టెంబర్ 10న అరెస్టు చేసింది. నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. అనంతరం సీఐడీ వినతి మేరకు ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ విధించి రాజమండ్రి జైలుకు పంపింది. ఆ తర్వాత 52 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. అనంతరం హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది.

supreme court to decide tdp chief chandrababus bail cancellation tomorrow

దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆధారాలను సరిగ్గా పరిశీలించలేదని, స్కిల్ కేసులో దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగా నిర్ణయం ప్రకటించేసిందని ఏపీ ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ పై అభ్యంతరాలు వక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు బెయిల్ రద్దవుతుందని ఆశాభావంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+