హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే: బోసిపోయిన ఐటి కారిడార్, నిర్మానుష్యం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సమగ్ర సర్వే ఎఫెక్ట్ రాజధాని హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపించింది. సర్వే కోసం జనం గ్రామాలకు తరలివెళ్లడంతో రాజధానిలో మంగళవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. నిత్యం రద్దీగా, వాహన శబ్దాలతో గజిబిజిగా ఉండే నగర రోడ్లన్నీ నిర్మానుష్యం అయ్యాయి. హైటెక్ సిటీ ప్రాంతం బోసిపోయి కనిపించింది.

సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు స్వగ్రామాలకు వెళ్లడం, నగర ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో మహా నగర రోడ్లన్నీ బోసిపోయాయి. దీనికితోడూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా రోడ్డెక్క లేదు. అందరూ సర్వేలో బిజీ అయిపోయారు.

వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, చివరికి ఇరానీ చాయ్ హోటళ్లు కూడా స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తెలంగాణ బంద్ సందర్భంగా కూడా లేనంతగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది.

నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో కిటకిటలాడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర మార్గాలన్నీ వెలవెలబోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ పాతబస్తీలో కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా చిన్న చిన్న హోటళ్లు, దుకాణాల నుంచి పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల వరకు మూసివేశారు. బస్సులు కూడా డిపోలకే పరిమితం కావడంతో నగరంలోని ఎంజిబిఎస్, జూబ్లీ బస్టాండ్‌లు ఖాళీగా బోసిపోయాయి.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

నిత్యం వేలాది వాహనాలు, ఉద్యోగులతో కిక్కిరిసిపోయి ఉండే మాదాపూర్ ఐటి కారిడార్ సమగ్ర సర్వే కారణంగా నిర్మానుష్యంగా కనిపించింది.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సమగ్ర సర్వే ఎఫెక్ట్ రాజధాని హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపించింది.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

సర్వే కోసం జనం గ్రామాలకు తరలివెళ్లడంతో రాజధానిలో మంగళవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

నిత్యం రద్దీగా, వాహన శబ్దాలతో గజిబిజిగా ఉండే బస్ స్టేషన్లు, నగర రోడ్లన్నీ నిర్మానుష్యం అయ్యాయి.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు స్వగ్రామాలకు వెళ్లడం, నగర ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో మహా నగర రోడ్లన్నీ బోసిపోయాయి.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

నగరంలోని ఓ కుటుంబం నుంచి వివరాలు సేకరిస్తున్న సర్వే ఎన్యుమరేటర్.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

సర్వేకు నగరం నుంచి పెద్ద సంఖ్యలో జనాలు స్వగ్రామాలకు వెళ్లడం, నగర ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. దీనికితోడూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా రోడ్డెక్క లేదు. అందరూ సర్వేలో బిజీ అయిపోయారు.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, చివరికి ఇరానీ చాయ్ హోటళ్లు కూడా స్వచ్ఛందంగా మూసివేశారు.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

దీంతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లపై జన సంచారం కూడా ఎక్కడా పెద్దగా కనిపించలేదు.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో కిటకిటలాడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఖైరతాబాద్ చౌరస్తా, పంజాగుట్ట, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర మార్గాలన్నీ వెలవెలబోయాయి.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

గతంలో ఎన్నడూలేనంతగా హైదరాబాద్ పాతబస్తీలో కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా చిన్న చిన్న హోటళ్లు, దుకాణాల నుంచి పెద్ద పెద్ద వాణిజ్య సంస్థల వరకు మూసివేశారు.

సర్వే ఎఫెక్ట్

సర్వే ఎఫెక్ట్

సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనాలు స్వగ్రామాలకు వెళ్లడం, నగర ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం కావడంతో మహా నగర రోడ్లన్నీ బోసిపోయాయి. దీనికితోడూ ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా రోడ్డెక్క లేదు.

English summary

 The roads across Telangana State wore a deserted look on Tuesday with the State government declaring a holiday to enable people to remain at home and participate in the comprehensive household survey. Even the usually busy roads in the capital city of Hyderabad were empty as public transport and auto-rickshaws went off the roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X