కూటమిని ప్రశ్నించేందుకు జగన్ కు భయమెందుకు ? రూటు మార్చిన సర్వే నిపుణుడు..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఈ కాలంలో ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయితే దీనిపై జనం సంతోషంగా ఉన్నారా లేదా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. ఇప్పటికీ చాలా అంశాల్లో ప్రభుత్వం వెనుకబడే ఉందని పలు సర్వే నివేదికలు చెప్తూనే ఉన్నాయి. అయితే ఆ మేరకు విపక్షం పుంజుకుంటోందా అంటే అదీ చెప్పలేని పరిస్ధితి. దీని వెనుక ఏముందనే దానిపై సర్వే నిపుణుడు ఒకరు ఆసక్తికర ట్వీట్ చేశారు.
గతంలో కూటమి సర్కార్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తరచుగా సర్వేలు చేసి గణాంకాలతో సహా బలంగా చెప్పి విజయం సాధించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పలు విషయాలు తీసుకుని వెళ్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన దృష్టి విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై పడింది. తాను ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే జగన్ ఆయా విషయాలపై ప్రశ్నించడం లేదని ఆనుకున్నారో ఏమో కానీ తాజాగా ప్రవీణ్ ఓ ట్వీట్ చేశారు.

ఇందులో వైసీపీని బలహీన విపక్షంగా ప్రవీణ్ పుల్లట అభివర్ణించారు. ఏపీలో బలహీనమైన ప్రతిపక్షం.. (విపక్షం ) ప్రశ్నించడానికి భయమెందుకు!? నిలదీయలేని రాజకీయాలెందుకు? అంటూ వైసీపీని ఉద్దేశించి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. దీంతో వైసీపీ ప్రస్తుతం ప్రశ్నించలేని సమస్యలు ఏంటి, వాటి వెనుక ఉన్న కారణాలేంటన్న దానిపై చర్చ జరుగుతోంది. అలాగే ప్రభుత్వం కూడా తమకు మద్దతుగా ఉండే సర్వే నిపుణుడు ప్రవీణ్ ఇలా రూటు మార్చి వైసీపీని ఎందుకు రెచ్చగొడుతున్నారన్న దానిపై ఆరా తీస్తోంది.
ఏపీలో బలహీనమైన ప్రతిపక్షం.. (విపక్షం )
— Praveen Pullata (@praveenpullata) September 20, 2025
ప్రశ్నించడానికి భయమెందుకు!?
నిలదీయలేని రాజకీయాలెందుకు?
Really Pity on AP Politics @ysjagan Reddy ji
There are several issues to address where people are not at all comfortable with current administration in AP
నేరుగా తాను అడుగుతున్న ప్రశ్నలకు అధికార కూటమి నుంచి తగిన సమాధానాలు రాకపోవడం, ప్రశ్నలు పెరుగుతున్నా జవాబులు లేకపోవడంతో ఇలా ప్రవీణ్ పుల్లట విపక్ష వైసీపీ ద్వారా తన ప్రశ్నలకు జవాబు సాధించుకునేందుకే ఇలా పోస్టు పెట్టారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి నేరుగా ప్రవీణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రభుత్వం ఇక రాజకీయంగా ప్రత్యర్ది అయిన జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్తుందా.. వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications