లోకేష్ బలం, బలహీనతలివే..! నిర్మొహమాటంగా చెప్పేసిన సర్వే నిపుణుడు..!

ఏపీలో కూటమి ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత బలమైన నేతగా కనిపిస్తున్న మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి ఇప్పటివరకూ రకరకాల విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో లోకేష్ ను ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కంటే బలమైన నేతగా, భవిష్యత్ ముఖ్యమంత్రిగా, టీడీపీపై పూర్తి పట్టు కలిగిన నాయకుడిగా ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. అయితే లోకేష్ బలహీనతల గురించి ఎక్కువగా చర్చ జరగలేదు.

అయితే గత ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి కచ్చితంగా గెలుస్తుందని పక్కా లెక్కలతో పలు సర్వేలు చేసి ఎప్పటికప్పుడు వీడియోలతో వివరాలు వెల్లడించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తాజాగా లోకేష్ బలంతో పాటు బలహీనతల్ని గురించి ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన నారా లోకేష్ ను కాబోయే సీఎంగా అభివర్ణించారు. దీంతో పాటు ఆయన బలం, బలహీనతల్ని నిర్మొహమాటంగా చెప్పేశారు. కడపలో టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ ప్రవీణ్ పుల్లట విశ్లేషణపై పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

survey expert praveen pullata reveals nara Lokesh s strength and weakness amid tdp mahanadu

టీడీపీ ఆశాకిరణం, భావి సీఎం నారా లోకేశ్ ! అని సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తన పోస్టులో వెల్లడించారు. యువతరం, టీడీపీ క్యాడర్ అతడి బలం అన్నారు. అలాగే కూటమి, టీడీపీ సీనియర్లు, మీడియా అధిపతి ఆయన బలహీనతగా పేర్కొన్నారు. ఇందులో యూత్, టీడీపీ క్యాడర్ లోకేష్ కు కచ్చితంగా బలమే అని ఇప్పటివరకూ జరుగుతున్న చర్చకు బలం చేకూరింది. అయితే లోకేష్ కు కూటమి బలహీనత అని చెప్పడంపై మాత్రం చర్చ జరుగుతోంది.

ఎందుకంటే కూటమి ఉండగా చంద్రబాబు కాకుండా లోకేష్ సీఎం అవుతానంటే పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు ఒప్పుకునే పరిస్ధితి లేదన్న చర్చ ఉండనే ఉంది. ఇప్పటికే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే చర్చ మొదలుకాగానే జనసేన నేతలంతా పవన్ ను సీఎం చేయాలనే కౌంటర్ చర్చను తెరపైకి తెచ్చారు. దీంతో టీడీపీ, జనసేన అధిష్టానాలు చర్చించుకుని ఈ చర్చలకు పుల్ స్టాప్ పెట్టారు. అలాగే టీడీపీ సీనియర్లు లోకేష్ సీఎం కాకుండా అడ్డుపడతారన్న చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. మరోవైపు మీడియా అధిపతి కూడా లోకేష్ బలహీనత అంటూ ప్రవీణ్ పుల్లట చెప్పినదాన్ని బట్టి చూస్తే టీడీపీకి మద్దతుగా ఉండే మీడియా అధిపతుల్లో ఎవరనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+