టీడీపీ సహకరించట్లేదు..! భవిష్యత్తులో సమస్యలే- జనసేన బహిష్కత నేత షాకింగ్..!

ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎన్నికల తర్వాత మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. అయితే రాష్ట్ర స్ధాయిలో పరిస్ధితి బాగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం సమస్యలు తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా టీడీపీపై ఆరోపణలు చేసి బహిరంగ నిరసనలకు దిగిన ఓ నేతను పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేసేశారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

తాజాగా జరిగిన కొవ్వూరు నియోజకవర్గ సహకార సొసైటీల నియామకాల్లో జనసేన పార్టీకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పార్టీ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉండగా.. వీటిలో మూడు పదవులు తమకు ఇవ్వాలని జనసేన ఇన్‌ఛార్జిగా ఉన్న టీవీ రామారావు పార్టీ శ్రేణులతో ఆందోళన చేపట్టి డిమాండ్ చేశారు. అయితే పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా రామారావు ఇలా ఆందోళనకు దిగడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా ప్రకటించి పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

suspended janasena leader tv Ramarao sensational allegations on tdp s non-cooperation

ఈ నేపథ్యంలో టీవీ రామారావు ఇవాళ సోషల్ మీడియా ద్వారా కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు నా మనవి అంటూ ఓ బహిరంగ లేఖను ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఇందులో ఆయన కొవ్వూరులో జనసేన పార్టీకి తగిన గౌరవం, ప్రాధాన్యత లభించట్లేదని గమనించానని, సొసైటీలు, ఏఎంసీల పదవుల్లో తమను పట్టించుకోవడం బాధాకరమని వాపోయారు. జనసేన మాత్రం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ సమైక్యతకు కట్టుబడి ఉందన్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని సముచిత చర్యలు తీసుకోవాలని టీవీ రామారావు కోరారు. ఇదే పరిస్ధితి కొనసాగితే మాత్రం వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పొత్తు ప్రభావం ఫలితాలపై ప్రతికూలంగా పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవ్వూరులో టీడీపీ-జనసేన పొత్తు బలోపేతం కావాలని, రెండు పార్టీల మధ్య సమన్వయం, సహకారం మరింత బలపడాలని ఆయన కోరారు. ఈ విషయంలో పవన్, చంద్రబాబు జోక్యం, మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+