స్వయం ఏపీ బ్రాండ్ - సీఎం చంద్రబాబు టార్గెట్ ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళా సంక్షేమానికి విశేషమైన ప్రాధాన్యతను ఇస్తుంది. అంతే కాదు కూటమి ప్రభుత్వం ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇదే సమయంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచటం కోసం కృషి చేస్తుంది. దీంతో తాజాగా డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉతపత్తులను మార్కెటింగ్ చేయటానికి 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ఆవిష్కరించింది.

డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ 'స్వయం ఏపీ' బ్రాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ సీఈవో వాకాటి కరుణతో కలిసి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ బ్రాండ్ దేశ, విదేశాల్లో అందరి మన్ననలు పొందాలని, ఏపీ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆకాక్షించారు.

Swayam AP Brand Launch ap cm chandrababu Naidu s Initiative for SHG Women Products Hits international Markets

ఈ బ్రాండ్ కింద రాష్ట్రంలోని 26 జిల్లాల సంప్రదాయ ఉత్పత్తులు ఒకే వేదికపైకి వస్తున్నాయి. ప్రస్తుతం 65 రకాల ఉత్పత్తులను 587 మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్నాయి. భీమలి మామిడి తాండ్ర, ముగడ ఆర్గానిక్ బెల్లం వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఇప్పటికే ఎంపికయ్యాయి. నాణ్యతా ప్రమాణాలు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్‌తో వీటిని జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అక్టోబర్ 15 నుంచి విజయవాడలోని సిగ్నేచర్ స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జాతీయ సరస్ మేళాలో కూడా ఈ ఉత్పత్తులు ప్రదర్శనకు వస్తాయి. సీఎం చంద్రబాబు ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.

బెంగుళూరు పబ్ ఏపీ ఐఏఎస్ వీరంగం.. సీఎం చంద్రబాబు వల్లే.. భూమన టార్గెట్!
బెంగుళూరు పబ్ ఏపీ ఐఏఎస్ వీరంగం.. సీఎం చంద్రబాబు వల్లే.. భూమన టార్గెట్!

రుణ సౌకర్యాలు రూ.68,585 కోట్లు, శిక్షణ, మార్కెట్ లింకేజీలు, ఎగుమతి అవకాశాలు కల్పించి మహిళల ఆర్థిక స్వావలంబనకు బలం చేకూరుస్తున్నారు. ఏపీఎన్ఆర్టీఎస్‌తో కలిసి విదేశీ మార్కెట్లకు కూడా చేరువ చేయాలని మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. స్వయం ఏపీ బ్రాండ్ ద్వారా గ్రామీణ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు చేరుకుంటాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+